Bajaj New CNG Bike : బజాజ్ బైక్స్, స్కూటర్స్ చాలా ఫేమస్. వాటి మైలేజీ కూడా మిగతా ఆటోమొబైల్స్ కంటే ఎక్కువే. ఈ తరుణంలో మరింత ఎక్కువ మైలేజీని అందించగల సీఎన్జీ ఫ్యుయల్ మోటారు సైకిల్ ను త్వరలో మార్కెట్లోకి ఆవిష్కరించేందుకు బజాజ్ సన్నాహాలు చేస్తోంది. పెట్రోల్ తో పోలిస్తే సీఎన్జీ ఫ్యూయల్ ధర చాలా చౌక. అందుకే సీఎన్జీ ఫ్యూయల్ బైక్స్ తయారీపై ఫోకస్ చేస్తున్నామని బజాజ్ ఆటో ఎండీ అండ్ సీఈఓ రాజీవ్ బజాజ్ ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. పెట్రోలు ధరలను భరించలేని వారికి ఎంట్రీ లెవల్ సీఎన్జీ ఫ్యూయల్ బైక్స్ చాలా బెటర్ అని, వీటి వాడకంతో నెలవారీ పెట్రోలు ఖర్చులు సగానికి సగం తగ్గుతాయని ఆయన చెప్పారు.
Also read : Mutton Offering To Ganesha: ఇదేం చోద్యం.. అక్కడ వినాయకుడికి మటన్, చికెన్ నైవేద్యం.. ఎక్కడంటే..?
ఈ రకం మోటార్ సైకిళ్లతో బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్, సేఫ్టీ వంటి ఆందోళనేదీ ఉండదని రాజీవ్ బజాజ్ స్పష్టం చేశారు. ఇప్పటికే దేశంలో సీఎన్జీ ఆటోల అమ్మకాల్లో బజాజ్ ఆటో మార్కెట్ వాటా దాదాపు 70 శాతం ఉంది. ఇప్పుడు ఇదే మోడల్ ను బైక్ సెగ్మెంట్ లో అప్లై చేసేందుకు బజాజ్ రెడీ అవుతోంది. ఒకవేళ బజాజ్ కంపెనీ సీఎన్జీ బైక్ లేదా మోటార్ సైకిల్ ను రిలీజ్ చేస్తే.. భారత మార్కెట్లో పూర్తిస్థాయిలో సీఎన్‌జీ ఫ్యూయల్ వినియోగంతో పనిచేసే తొలి మోటార్ సైకిల్ అదే అవుతుంది. 2016లో ప్రయోగాత్మకంగా కేంద్ర ప్రభుత్వం సీఎన్‌జీ ఫ్యూయల్ టూవీలర్‌ను ఆవిష్కరించింది. సీఎన్‌జీ పవర్డ్ హోండా యాక్టివా స్కూటర్లను ఢిల్లీలో ఫుడ్ డెలివరీ సర్వీసుల కోసం ప్రయోగాత్మకంగా (Bajaj New CNG Bike) వినియోగిస్తున్నారు.