Site icon HashtagU Telugu

Apoorva Srinivasan : ఏడడుగులు వేసేసిన తెలుగు నటి.. ముద్దు ఫొటోలతో..

Tollywood Actress Apoorva Srinivasan Marriage Photos Gone Viral

Tollywood Actress Apoorva Srinivasan Marriage Photos Gone Viral

Apoorva Srinivasan : ఈ ఏడాది సినిమా పరిశ్రమలో పెళ్లి బాజాలు గట్టిగానే మోగుతున్నాయి. ఒకరి తరువాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతూ మ్యారేజ్ లైఫ్ ని స్టార్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ తెలుగు నటి సైలెంట్ గా మూడు ముళ్ళు వేయించేసుకుంది. ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించి యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేసిన నటి ‘అపూర్వ శ్రీనివాసన్’. ఆ తరువాత జ్యోతిలక్ష్మి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, విన్నర్, తొలిప్రేమ వంటి సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ వచ్చింది.

అయితే 2022లో ‘నీతో’ సినిమా తరువాత అపూర్వ మళ్ళీ స్క్రీన్ పై కనిపించలేదు. ఎందుకంటే అపూర్వ.. యాక్టింగ్ కెరీర్ నుంచి పైలెట్ కెరీర్ కి షిఫ్ట్ అయ్యింది. పైలెట్ గా గాలిలో విహరిస్తూ సక్సెస్ ఫుల్ లైఫ్ ని సాగిస్తుంది. ఇక ఈ సక్సెస్ ఫుల్ లైఫ్ లోకి.. ఓ భాగస్వామికి అపూర్వ స్వాగతం పలుకుతుంది. శ్రేయాస్ శివకుమార్ అనే వ్యక్తితో అపూర్వ ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసింది.

ఈ పెళ్లిని కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్ గా జరుపుకున్నారు. ఈ పెళ్ళికి టాలీవుడ్ నటి సిమ్రాన్ చౌదరి హాజరయ్యారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను అపూర్వ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి అందరికి తెలియజేసారు. ఇక షేర్ ఈ పిక్స్ లో లో కొత్త దంపతులు ముద్దులతో సందడి చేసారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజెన్స్.. అపూర్వకి కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నారు.

Also read : Avantika Vandanapu : టాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కి.. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అవార్డు..