Site icon HashtagU Telugu

Plane Crash : కూలిన విమానం.. ఏడుగురి మృతి

Plane Crash

Plane Crash

Plane Crash : ఏం జరుగుతోందో ఏమో.. విమానాలు పిట్టల్లా రాలిపోతున్నాయి.  బ్రెజిల్‌లో విమానాలు కూలిపోయే ఘటనలు ఆగడం లేదు. తాజాగా ఆదివారం మినాస్ గెరైస్ రాష్ట్రంలో ఒక చిన్నపాటి విమానం కూలిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. పొరుగున ఉన్న సావో పాలో రాష్ట్రంలోని కాంపినాస్ నుంచి బయలుదేరిన ఈ సింగిల్ ఇంజిన్ విమానం బయలుదేరిన కాసేపటికే తనపై తాను కంట్రోల్ కోల్పోయింది. చివరకు ఇటాపెవా అనే ప్రాంతంలో  ఒక్కసారిగా కూలిపోయింది.  హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే విమానంలోని ఏడుగురు చనిపోయారు.

We’re now on WhatsApp. Click to Join.

రెండు రోజుల క్రితమే.. 

Also Read :Telangana: కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. చివరికి ట్విస్ట్

కారుపై కూలిన విమానం

బెల్జియంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. బెల్జియంలోని స్పా సిటీలో ఏరో డ్రోమ్ సమీపంలో ఆగి ఉన్న కారుపైకి విమానం దూసుకెళ్లింది. దీంతో విమానంలోని ఇద్దరు చనిపోయారు. భారీ గాలులకు విమానం ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. విమానం కారు మీదకు దూసుకెళ్లడంతో.. భారీగా మంటలు చెలరేగాయి. ఫ్లైట్ లోని ఇద్దరు చనిపోయినట్లు.. అందులో ఒకరు జర్మన్ కు చెందిన పైలట్ అని పోలీసులు గుర్తించారు. మరోవైపు చనిపోయిన ఇంకో వ్యక్తి గురించి వివరాలు తెలియాల్సి ఉంది. కారు డ్రైవర్ అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సిగరెట్ బ్రేక కోసం డ్రైవర్ బయటకు వచ్చినప్పుడు ప్రమాదం జరిగినట్లు తెలిపారు పోలీసులు. ఎలాంటి కాలుష్యం జరగకుండా చూసుకునేందుకు పర్యావరణ పరిరక్షణ అధికారులు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు.