Surgery: అద్భుతం సృష్టించిన వైద్యులు.. 25 నిమిషాల్లో వెన్నెముక ఆపరేషన్?

మామూలుగా ఎముకలు విరిగినప్పుడు ఏదైనా ఆపరేషన్ చేయడానికి గంటల సమయం పడుతుంది. చిన్న చిన్న ఆపరేషన్ లు గంటకు లోపు కూడా అయిపోతూ ఉంటాయి. ఆపరే

  • Written By:
  • Publish Date - June 2, 2023 / 08:20 PM IST

మామూలుగా ఎముకలు విరిగినప్పుడు ఏదైనా ఆపరేషన్ చేయడానికి గంటల సమయం పడుతుంది. చిన్న చిన్న ఆపరేషన్ లు గంటకు లోపు కూడా అయిపోతూ ఉంటాయి. ఆపరేషన్ చేయడం అన్నది నిజంగా వైద్యులకు ఒక పరీక్ష అని చెప్పవచ్చు. ఒకవేళ వృద్దులకు కనుక ఎముకలు విరిగితే ఆపరేషన్ ఫర్ కాస్త కష్టంతో కూడుకున్నది అని చెప్పవచ్చు. ఇటువంటి ఇష్టమైన ఈ సమస్యకు కొత్త టెక్నాలజీ పరిష్కారం కనుగొంది. పోరిస్ట్ ఎస్కార్ట్స్ ఓఖ్లాలోని ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ కౌశల్ మిశ్రా ఉత్తర భారత దేశంలో మొట్టమొదటిసారిగా 65 ఏళ్ల మహిళలకు వెన్నుపూస సెప్టో ప్లాస్టి సర్జరీ చేసి అద్భుతం సృష్టించారు.

అయితే ఇప్పటివరకు హార్ట్ సర్జరీలో స్టంట్స్ వాడే వారిని డాక్టర్ కౌషల్ తెలిపారు. వెన్నెముక శస్త్ర చికిత్సలో స్టంట్స్ ని ఉపయోగించడం ఇదే మొదటిసారి. సెప్టో ప్లాస్టిక్ అనేది ఒక విప్లవాత్మక సాంకేతికత, ఇందులో వెన్నుపూస శరీరం లోపల స్టాట్ ను చొప్పించడం ద్వారా సిమెంటును పూస్తారని,తీవ్రమైన నొప్పికి ఇది చాలా ప్రభావవంతమైన చికిత్సగా ఉంటుంది అని ఆయన వెల్లడించారు. తాజాగా బీహార్ లోనే బెగుసరాయిలో నివాసం ఉంటున్న సుధా సింగ్ అనే ఒక మహిళ ఇంట్లో పని చేస్తూ కుప్పకూలి పడిపోయింది. దాంతో ఆమె స్వస్థలమైన బిగుసురాయిలని ఆస్పత్రిలో చేరారు. పరీక్షల్లో ఆమెకు వెన్నపూసలో కంప్రెషన్ ఫ్యాక్చర్ ఉంది అని తేలింది.

దాని కారణంగా చాలా నొప్పి వెన్నుపూస దెబ్బ తినడం వల్ల ఆమె నిలబడలేకపోయింది. అముకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించినప్పటికి నయం కాలేదు. వెంటనే కుటుంబ సభ్యులు ఢిల్లీకి తీసుకొని రాగా డాక్టర్ కౌషల్ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవును పరీక్షించిన డాక్టర్ కౌశల్ ఆమెకు బలహీనత, రక్తపోటు, మధుమేహం, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ఆస్టియో అర్థరైటిస్ లాంటి వ్యాధులు ఉన్నట్లు గుర్తించారు. అవి శస్త్ర చికిత్సకు మరింత ప్రమాదకరం కావచ్చు. దాంతో అన్ని ప్రమాదాలను దృష్టిలో ఉంచుకున్న వైద్యులు సంప్రదాయ శస్త్ర చికిత్స పద్ధతిని అనుసరించకుండా సెప్టో ప్లాస్టి విధానాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు డాక్టర్ కౌశల్ తెలిపారు. ఆమెకు కేవలం 25 నిమిషాల్లోనే ఈ సర్జరీ చేసి ఒక్కరోజులోనే డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు వివరించారు. నిజంగా వైద్య చరిత్రలో ఇది మరో అద్భుతం అని చెప్పవచ్చు.