నేపాల్ (Nepal)లో మరోసారి భూకంపం (Earthquake)సంభవించింది. గురువారం అర్థరాత్రి రెండుసార్లు భూకంపం సంభవించింది. బజురాలోని దహకోట్‌లో భూకంపం కేంద్రం చెప్పింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8, 5.9గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. మొదటి భూకంపం రాత్రి 11:58 గంటలకు (స్థానిక కాలమానం) సంభవించింది. దీని తీవ్రత 4.9గా ఉంది. దీని తర్వాత అర్ధరాత్రి 1:30 గంటలకు 5.9 తీవ్రతతో మరో భూకంపం నమోదైంది.
నేపాల్‌లోని సుర్‌ఖేత్ జిల్లాలో భూకంప విజ్ఞాన కేంద్రం అధికారి రాజేష్ శర్మ మాట్లాడుతూ.. గంటన్నర వ్యవధిలో ఈ ప్రకంపనలు సంభవించాయని, ఇది ప్రజలను భయాందోళనలకు గురిచేసిందని తెలిపారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.
Also Read: Delhi Excise Scam : ఢిల్లీ లిక్కర్ కేసులో మూడవ ఛార్జీషీట్ వేసిన ఈడీ
అంతకుముందు ఏప్రిల్ 1న డోలాఖా జిల్లాలోని సూరి వద్ద ఒక మోస్తరు తీవ్రతతో భూకంపం నమోదైంది. ఇక్కడి నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. ఖాట్మండుకు తూర్పున 180 కిమీ దూరంలోని డోలాఖా వద్ద ఉదయం 11.27 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) 5.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఓఖల్‌దుంగా, రామేచాప్, సింధుపాల్ చౌక్, నువాకోట్ జిల్లాలతో పాటు ఖాట్మండు లోయలో కూడా ప్రకంపనలు సంభవించాయి.
2015 ఏప్రిల్ లో నేపాల్‌లో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ సమయంలో సుమారు 9,000 మంది మరణించారు. 22,000 మంది గాయపడ్డారు. ఇది 800,000 కంటే ఎక్కువ గృహాలు, పాఠశాల భవనాలను దెబ్బతీసింది. IIT కాన్పూర్ సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన సీనియర్ ప్రొఫెసర్, జియోసైన్స్ ఇంజనీరింగ్‌లో నిపుణుడు జావేద్ ఎన్. మాలిక్ 2015లో కూడా నేపాల్‌లో 7.8 నుంచి 8.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తెలిపారు. భూకంప కేంద్రం తూర్పు నేపాల్. అయితే, హిమాలయ శ్రేణిలోని టెక్టోనిక్ ప్లేట్ అస్థిరంగా మారింది. దీని వల్ల చాలా కాలం పాటు ఇలాంటి భూకంపాలు వస్తూనే ఉంటాయి.