Site icon HashtagU Telugu

Aadhaar – PAN: ఆధార్ పాన్ లింకింగ్ కొత్త మినహాయింపు రూల్స్ ఇవే

These Are The New Exemption Rules For Aadhaar Pan Linking

These Are The New Exemption Rules For Aadhaar Pan Linking

ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డ్ (PAN Card) హోల్డర్స్ తప్పనిసరిగా తమ ఆధార్ (Aadhaar) నెంబర్‌ను లింక్ చేయాలని కోరుతున్న సంగతి తెలిసిందే. గతేడాది 2022 మార్చి 31న గడువు ముగిసింది. అయితే రూ.1,000 జరిమానా చెల్లించి 2023 మార్చి 31 వరకు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ (PAN – Aadhaar Link) చేసే వెసులుబాటు కల్పించింది. కాబట్టి పాన్ కార్డ్ హోల్డర్స్‌కు ఇంకొన్ని రోజులు గడువు ఉంది. 2023 మార్చి 31 వరకు పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే 2023 ఏప్రిల్ 1 నుంచి ఆ పాన్ కార్డ్ చెల్లదు. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం మినహాయింపు కేటగిరీ పరిధిలోకి రాని పాన్ కార్డ్ హోల్డర్స్ 2023 మార్చి 31 లోగా ఆధార్ నెంబర్ లింక్ చేయాలని, లేకపోతే 2023 ఏప్రిల్ 1 నుంచి ఆ పాన్ కార్డ్ చెల్లదని ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ట్వీట్ చేసింది.

మినహాయింపు కేటగిరీ పరిధిలోకి రాని పాన్ కార్డ్ హోల్డర్స్ తప్పనిసరిగా ఆధార్ నెంబర్ లింక్ చేయాలన్నది ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ ప్రకారం తెలుస్తుంది. మరి మినహాయింపు కేటగిరీ ఎవరికి వర్తిస్తుంది? పాన్ ఆధార్ లింకింగ్ ఎవరికి తప్పనిసరి కాదు? అన్న సందేహాలు పాన్ కార్డ్ హోల్డర్స్‌లో ఉన్నాయి. 2017 మేలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో మినహాయింపు కేటగిరీ గురించి వివరించింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఎవరికి పాన్ ఆధార్ లింకింగ్ తప్పనిసరి కాదో తెలుసుకోండి.

పాన్ ఆధార్ లింకింగ్ (PAN – Aadhaar Link) మినహాయింపు ఎవరికి?

1. అస్సాం, మేఘాలయ , జమ్మూ, కాశ్మీర్‌లో నివసిస్తున్నారు.

2. ఆదాయపు పన్ను చట్టంలోని 1961 ప్రకారం నాన్ రెసిడెంట్.

3. ఎనభై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు.

4. భారత పౌరులు కానివారు.

పాన్ ఆధార్ లింకింగ్ (PAN – Aadhaar Link) ఎవరికి తప్పనిసరి?

పైన వివరించినవారు కాకుండా ఇతరులు తప్పనిసరిగా తమ పాన్ నెంబర్‌ను ఆధార్ నెంబర్‌కు లింక్ చేయాల్సిందే. ఇప్పటికే మీరు మీ పాన్ నెంబర్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేసినట్టైతే స్టేటస్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. పాన్ ఆధార్ ఎలా లింక్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు పాన్ నెంబర్ , ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి రూ.1,000 జరిమానా చెల్లించాలన్న విషయం గుర్తుంచుకోండి. www.incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌లో పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయొచ్చు.

Also Read:  Mukesh Ambani: ముఖేష్ అంబానీ రాకతో కళగా మారిన ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ సమ్మిట్