Site icon HashtagU Telugu

Rabindranath Tagore నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ 82వ వర్ధంతి

Rabindranath Tagore

New Web Story Copy 2023 08 07t133411.924

Rabindranath Tagore: మొట్టమొదటి భారతదేశ నోబెల్ బహుమతి గ్రహీత, విశ్వ కవి, జాతీయ గీత సృష్టికర్త, గొప్ప వ్యాస కర్త, రవీంద్రనాధ్ ఠాగూర్ గారి వర్ధంతి ఈ రోజు. ఆయన 1941 ఆగస్టు 7న మరణించారు. జన గణ మన అని భారతదేశ ఔనత్యాన్ని గేయ రూపంలో చాటి చెరగని ముద్ర వేశారు. ఠాకూర్ కోల్‌కతా‌లో 1861 మే 7 జన్మించారు. రవీంద్ర‌నాథ్ ఠాగూర్ కు చిన్ననాటి నుండే సాహిత్యంపై ఇష్టం ఉండేది. పాఠశాలకు వెళ్లడానికి ఇష్టపడని ఠాగూర్ ఇంటి దగ్గరే విద్యను నేర్చుకున్నారు. ఉదయం గణితం, చరిత్ర, భూగోళ పాఠాలను, సాయంత్రం చిత్రలేఖనం, ఆటలు, ఇంగ్లీషు నేర్చికున్నారు. సెలవు దినాలలోనూ ఎదో ఒక వ్యాపకం చేస్తూ ఉండేవారు. ఆదివారాలలో సంగీత, భౌతిక శాస్త్రం ప్రయోగాలు, సంస్కృత వ్యాకరణం మీద శ్రద్ధ చూపేవారు. బెంగాలీతోపాటు ఆంగ్ల భాషల్లోనూ పట్టు సంపాదించిన రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలను బాగా చదివేవారు. దీంతో సాహిత్యంపై మక్కువ పెరిగింది. చదువు మీద ఆయనకున్న శ్రద్ధ చూసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపడేవారు. ఉన్నత చదువులకోసం ఇంగ్లాండు వెళ్ళాడు. విదేశాలకు వెళ్లి కేవలం చదువుని మాత్రమే కాకుండా ఆంగ్ల సంస్కృతి, సంప్రదాయాలు, అక్కడి వాతావరణాన్ని అర్ధం చేసుకున్నాడు. ఇంగ్లండులో ఉన్న సమయంలోనే భగ్న హృదయం అనే కావ్యాన్ని రచించాడు. విర్గరేర్ స్వప్న బంగ, సంగీత ప్రభాత అనే భక్తి గీతాలను కూడా రాశారు. ఆయన రచనల్లో గీతాంజలి బాగా ప్రాచుర్యం పొందింది. మొదట బెంగాలీ భాషలో రచించి, ఆ తరువాత ఆంగ్లంలోకి అనువదించారు. ఈ రచనకి గానూ 1913 సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. మ‌నం జాతీయ గీతంగా పిలుచుకునే ‘జనగణమణ’ను ఆయ‌నే ర‌చించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ పిల్లల కోసం శాంతినికేతన్ అనే విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. దీనిని విశ్వభారతి విశ్వవిద్యాలయం అని కూడా పిలుస్తుంటారు.

Also Read: Gaddar – Pawan : సోషల్ మీడియా లో వైరల్ గా మారిన పవన్ గురించి గద్దర్ చెప్పిన మాటలు