Site icon HashtagU Telugu

Palani Temple: మెట్టు మెట్టుకు హారతి వెలిగిస్తూ.. పళని దేవాలయం లో సమంత

Step by step lighting the arathi.. Samantha in the Palani temple

Samntha

సమంత ఆధ్యాత్మిక బాటలో ప్రయాణిస్తోంది. ఇటీవలే మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడినట్టు ప్రకటించిన సమంత చికిత్సతో చాలా వరకు కోలుకుంది. కోలుకుందనడానికి నిదర్శనంగా జిమ్ లో మళ్లీ కసరత్తులు చేస్తున్న వీడియోని విడుదల చేసింది. మయోసైటిస్ వ్యాధిలో కండరాల నొప్పులు వేధిస్తాయి. సమస్య నుంచి ఉపశమనం రావడంతో తిరిగి సమంత సినిమా చిత్రీకరణల్లో పాల్గొననుంది. ఈ క్రమంలో తమిళనాడులోని పళని మురుగన్ ఆలయాన్ని (Palani Temple) సోమవారం దర్శించుకుంది.

ఆలయంలో స్వామి వారిని చేరుకోవడానికి 600 మెట్లు ఉంటాయి. మెట్ల మార్గంలో వెళ్లి స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొంది. ప్రతీ మెట్టుపై హారతి కర్పూరం వెలిగించి నడుచుకుంటూ వెళ్లింది. పళని మురుగన్ (Palani Temple) ను అరుళ్మిగు దండయుతపాణి స్వామి అని కూడా పిలుస్తారు. నటి సమంతా వెంట తోటి నటీనటులు, దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ తదితరులు ఉన్నారు. సమంతా నటించిన శాకుంతలం విడుదల కావాల్సి ఉండగా, ఖుషీ సినిమా చిత్రీకరణ జరగాల్సి ఉంది. ఇంకా చాలా సినిమాలు ఆమె ఖాతాలో  ఉన్నాయి.

Also Read:  Divyavani: సినిమా వాళ్లంటే చులకన దేనికి ?: నటి దివ్యవాణి