Site icon HashtagU Telugu

Shocking: కర్ణాటకలో కలకలం.. రైల్వే ట్రాక్ పై రాళ్లు పెట్టిన బాలుడు, నెట్టింట్లో వీడియో వైరల్!

Railway Track

Railway Track

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కర్ణాటకలో రైలు పట్టాలపై రాళ్లు పెట్టిన మైనర్ బాలుడి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ట్రాక్‌ పై వరుసగా రాళ్లు పెట్టాడు మైనర్ బాలుడు. అయితే ఓ వ్యక్తి సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే బాలుడిని ఈడ్చుకెళ్లి రైల్వే ట్రాక్‌పై ఉన్న రాళ్లను తొలగించేలా మందలించాడు.

ట్రాక్‌పై రాళ్లు ఎందుకు పెట్టావని, ఎన్నిరోజులుగా ఇలా చేస్తున్నావని స్థానికులు బాలుడిని ప్రశ్నించగా, ఎవరూ చెప్పలేదని, ఇలా చేయడం ఇదే తొలిసారి అని బాలుడు ఒప్పుకున్నాడు. పోలీసులకు అప్పగించాలని ఓ వ్యక్తి చెప్పగా, ఆ బాలుడు అతడి పాదాలను తాకి పోలీసులకు అప్పగించవద్దని బతిమిలాడాడు.  ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని పరిశీలించాలని కోరారు. “ఇది తీవ్రమైన సమస్య. కర్ణాటకలో రైల్వే ట్రాక్‌ను ధ్వంసం చేస్తూ ఓ బాలుడు పట్టుబడ్డాడు. మనకు పదివేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. పిల్లలను కూడా విధ్వంసానికి, మరణాలకు కారణమవుతున్నారు’’ అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: Adipurush Team: ఆంజనేయుడి కోసం థియేటర్లలో ప్రత్యేకంగా ఓ సీటు: ఆదిపురుష్ టీం!