Good Bacteria in Gut: మన గట్‌లో మంచి బ్యాక్టీరియాను పెంచే పద్ధతిని కనుగొన్న శాస్త్రవేత్తలు

మనిషి పేగుల్లో గట్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మనం తిన్న ఫుడ్ జీర్ణం కావడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. గట్ బ్యాక్టీరియా అనేది సహజంగానే మన పేగుల్లో..

మనిషి పేగుల్లో గట్ బ్యాక్టీరియా (Good Bacteria) ఉంటుంది. ఇది మనం తిన్న ఫుడ్ జీర్ణం కావడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. గట్ బ్యాక్టీరియా అనేది సహజంగానే మన పేగుల్లో ఉద్భవిస్తుంది. కానీ శాస్త్రవేత్తలు దాన్ని కృత్రిమంగా గట్ లో పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. మనిషి పేగుల్లో మంచి గట్ బ్యాక్టీరియాను పెంచే సరికొత్త పద్ధతిని అమెరికాలోని యేల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రయోజన కరమైన గట్ బ్యాక్టీరియా జాతుల పెరుగుదలను ప్రోత్సహించడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ పరిశోధన నివేదికలు “సైన్స్” జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి.

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. కార్బన్ లోటును ఎదుర్కొన్న ప్పుడు మానవ గట్‌లో సమృద్ధిగా ఉన్న ప్రయోజనకరమైన బ్యాక్టీరియా జాతులలో ఒకటి దాని వలస సామర్థ్యాన్ని పెంచుతుంది. గట్ లో ఉండే ప్రయోజనకరమైన బాక్టీరియా “బాక్టీరాయిడ్స్ థెటాయోటామైక్రాన్” అనేది కార్బన్ లోటు పరిస్థితులకు ప్రతి స్పందించిందని తాజా పరిశోధనలో కనుగొన్నారు.

గట్ బ్యాక్టీరియా (Good Bacteria) అంత ముఖ్యమా?

ఈ గట్ బ్యాక్టీరియాలు మన శరీరాలపై పరాన్నజీవుల వలె జీవిస్తున్నాయి. అవి నిజానికి శరీరంతో సహజీవన సంబంధాన్ని ఏర్పరుచు కుంటాయి. అవి కూడా ఆరోగ్యంగా ఉండేలా మనం సమతుల్యతను కాపాడుకోవాలి. ఎందుకంటే అవి మన శరీరంలో నివసిస్తున్నప్పుడు, వాటి సొంత శారీరక జీవక్రియ, ప్రక్రియలు కూడా మన శరీరంలోనే జరుగుతాయి. మన శరీరాన్ని అవి పర్యావరణంగా భావిస్తాయి. మన ఆహారంలోని పోషకాలు గట్ నుంచి రక్తంలోకి ప్రయాణిస్తున్నట్లే.. గట్‌లోని బ్యాక్టీరియా ద్వారా తయారైన పదార్థాలు రక్తంలోకి ప్రవేశిస్తాయి. అలాగే, కొన్ని నరాలు మెదడు, ప్రేగులను కలుపుతాయి. కాబట్టి, అవి ఆరోగ్యంగా ఉన్నంత వరకే మెదడు సేఫ్‌గా ఉంటుంది. కాబట్టి, ఆ బ్యాక్టీరియాకు చెందిన పర్యవరణం(మన శరీరం)ను పాడు చేయకూడదు. ఇంత ముఖ్యమైనవి కాబట్టే మంచి గట్ బ్యాక్టీరియాను పెంచడంపై ఇటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి.

గట్ బ్యాక్టీరియా హెల్త్ కోసం ఏం తినాలి?

మన కడుపు, పేగుల్లో నివసించే ట్రిలియన్ల కొద్దీ బ్యాక్టీరియాకు మంచి ఆరోగ్యాన్ని అందించాలంటే మనం ఫైబర్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.  ఫైబర్ గుండె జబ్బులు, క్యాన్సర్లను తగ్గిస్తుంది. బరువును నియంత్రిస్తుంది. వీలైనన్ని ఎక్కువ రకాల పండ్లు, కూరగాయలను తీసుకోండి. సీజనల్ ఫ్రూట్స్‌ను అస్సలు మిస్ కావద్దు. ఆర్టిచోక్‌లు, లీక్స్, ఉల్లిపాయలు, వెల్లుల్లిలో అధిక-ఫైబర్ ఉంటుంది. అధిక స్థాయిలో ప్రీబయోటిక్ ఫైబర్ ఉంటుంది. అధిక స్థాయి పాలీఫెనాల్స్ (సూక్ష్మజీవులకు ఇంధనంగా పనిచేసే యాంటీఆక్సిడెంట్లు) ఉన్న ఆహారం, పానీయాలను ఎంచుకోండి. ఎక్కువగా గింజలు, గింజలు, బెర్రీలు, ఆలివ్ నూనె, బ్రాసికాస్, కాఫీ, టీ తీసుకోండి. గ్రీన్ టీ తాగండి.

Also Read:  Fire Boltt Terminator: రూ. 2 వేల కంటే తక్కువ ధరలో స్మార్ట్ వాచ్ కొనాలని ఉందా.. ఫైర్-బోల్ట్ టెర్మినేటర్ పై ఓ లుక్కేయండి..