Site icon HashtagU Telugu

PM Modi : మలయాళ నటుడు సురేష్ గోపి కూతురి వివాహానికి హాజరయిన ప్రధాని మోదీ..

PM Modi Attend Malayalam Star Actor Suresh Gopi Daughter Wedding in Kerala

PM Modi Attend Malayalam Star Actor Suresh Gopi Daughter Wedding in Kerala

మలయాళం స్టార్ నటుడు, కేరళ బీజేపీ నేత సురేష్ గోపి(Suresh Gopi) కూతురి వివాహానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. సురేష్ గోపి దాదాపు 250 సినిమాలతో మలయాళంలో స్టార్ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా నేడు ఉదయం సురేష్ గోపి కూతురు భాగ్య వివాహం శ్రేయాస్ మోహన్ అనే వ్యక్తితో జరిగింది.

ఈ వివాహం కేరళలోని గురువాయూర్ లో ఉన్న ప్రఖ్యాత శ్రీకృష్ణ ఆలయంలో హిందూ సాంప్రదాయ పద్దతిలో జరిగింది. అయితే సురేష్ గోపి బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు కావడంతో ప్రధాని మోదీని(PM Modi )ఆహ్వానించారు. దీంతో మోదీ ఈ వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులని ఆశీర్వదించి అనంతరం ఆలయంలోనే గంటకు పైగా గడిపారు.

మోదీ పర్యటన నిమిత్తం ఆలయం చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. వివాహం అనంతరం మోదీ కేరళలోని పలు కార్యక్రమాలలో పాల్గొనడానికి వెళ్లారు. మోదీ వచ్చి కొత్తజంటని ఆశీర్వదించిన పలు ఫోటోలని సురేష్ గోపి తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇక సురేష్ గోపి కూతురి వివాహానికి మలయాళం స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్, జయరాం.. లతో పాటు అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయి కొత్త జంటని ఆశీర్వదించారు.

 

Also Read : Tamil Sankranti Movies : తమిళ్ సంక్రాంతి సినిమాలకు ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి?