Site icon HashtagU Telugu

MUSLIM DEPUTY CM : ముస్లింనే డిప్యూటీ సీఎం చేయాలి : కర్ణాటక వక్ఫ్ బోర్డు చీఫ్

Muslim Deputy Cm

Muslim Deputy Cm

ఓ వైపు కర్ణాటక సీఎం క్యాండిడేట్ పై కాంగ్రెస్ పార్టీ ఇంకా క్లారిటీకి రాలేదు. ఈ తరుణంలో వొక్కలిగ, లింగాయత్ సహా ఎన్నో సామాజిక వర్గాలు తమ వాళ్లకు సీఎం, డిప్యూటీ సీఎం పోస్టుల్లో ఛాన్స్ ఇవ్వాలని హస్తం పార్టీని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులో కర్ణాటక సున్నీ ఉల్మా బోర్డు నాయకులు కూడా చేరారు. ముస్లిం కమ్యూనిటీ నుంచి గెలిచిన అభ్యర్థుల్లో ఒకరికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి (MUSLIM DEPUTY CM) పదవిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐదుగురు ముస్లిం ఎమ్మెల్యేలకు హోం, రెవెన్యూ, ఆరోగ్యం, ఇతర శాఖల వంటి మంచి శాఖలను కేటాయించాలని కోరారు.

ALSO READ : MVA Meeting: కర్ణాటక రాజకీయ ఫార్ములా ఇతర రాష్ట్రాల్లో అవసరం: పవార్

72 నియోజకవర్గాల్లో ముస్లింల వల్లే గెలిచింది

“డిప్యూటీ సీఎం ముస్లిం (MUSLIM DEPUTY CM) అయి ఉండాలి. మాకు 30 సీట్లు ఇవ్వాలని ఎన్నికలకు ముందే చెప్పాం.. కానీ మాకు 15 సీట్లు ఇచ్చారు. వారిలోనూ తొమ్మిది మంది ముస్లిం అభ్యర్థులు గెలిచారు. దాదాపు 72 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పూర్తిగా ముస్లింల వల్లే గెలిచింది. ఒక సంఘంగా మేం కాంగ్రెస్‌కు చాలా ఇచ్చాం. ఇప్పుడు మేం ప్రతిఫలంగా ఏదైనా పొందే టైం వచ్చింది. మాకు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి, ఐదు మంత్రి పదవులు కావాలి. మా సహాయానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది” అని వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్ షఫీ సాది పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు తాము కాంగ్రెస్ ఎదుట పెట్టిన డిమాండ్లపై చర్చించడానికే సున్నీ ఉల్మా బోర్డు కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించామని తెలిపారు. తొమ్మిది మంది ముస్లిం ఎమ్మెల్యేల్లో ఎవరికైనా పదవులు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. ఎన్నికల వేళ ముస్లిం అభ్యర్థుల్లో ఎవరు బాగా పనిచేశారనే దాని ఆధారంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవచ్చని సూచించారు. ముస్లింలకు డిప్యూటీ సీఎం కావాలని మాత్రమే తాము అడుగుతున్నామని షఫీ సాది పునరుద్ఘాటించారు.