Site icon HashtagU Telugu

Each mango 19000 : ఒక్కో మ్యాంగో రూ.19,000.. ఎక్కడ, ఎందుకు, ఎలా ?

Each Mango 19000

Each Mango 19000

కేజీ మామిడి పండ్లకు వేలాది రూపాయల రేటు అంటే.. మీరు విని ఉంటారు !! కానీ ఆ మామిడి రైతు తోటలో పాండే ఒక్కో మామిడి పండు రేటు ఎంతో తెలిస్తే మీరు కచ్చితంగా నోరెళ్లబెడతారు!! ఔను నిజమే.. ఆ రైతన్న తన తోటలో పండించే ఒక్కో మ్యాంగోను దాదాపు రూ. 19,000 (Each mango 19,000)కు అమ్ముకుంటున్నాడు. ఈ కాస్ట్లీ పండ్ల (Each mango 19,000)ను ప్యాకింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా దేశాలకు షిప్పింగ్ చేస్తున్నాడు. అందరితో అదుర్స్ అనిపిస్తున్న ఆ మ్యాంగో మ్యాన్ పేరు.. హిరోయుకి నకగావా (Hiroyuki Nakagawa).. ఇప్పుడు ఆయన వయసు 62 ఏళ్ళు !! ఇతడు జపాన్ ఉత్తర ద్వీపంలో అత్యంత చల్లగా ఉండే తోకాచి ప్రాంతానికి చెందిన రైతు. 2011 నుంచి కాస్ట్లీ మ్యాంగోస్ పండిస్తున్నాడు. తన మ్యాంగోస్ ను “హకుగిన్ నో తైయో” పేరుతో జపాన్ ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేసుకున్నాడు. జపాన్ భాషలో “హకుగిన్ నో తైయో” అంటే “మంచులో సూర్యుడు” అని అర్ధం.

also read : Money on Mango Tree: మామిడి చెట్లకు డబ్బులు

ఎందుకింత రేటు ?

ఇంతకీ ఈ మామిడి పండ్లకు ఎందుకింత రేటు ? అవేమైనా స్వర్గ లోకం నుంచి ఊడిపడ్డాయా ? అనే ప్రశ్నలు ఎవరి మైండ్ లోనైనా ఉదయిస్తాయి!! డిసెంబర్ నెలలో మామిడి రైతు హిరోయుకి నకగావా నివసించే తోకాచి ప్రాంతంలో ఉష్ణోగ్రత మైనస్ 8 డిగ్రీల సెల్సీయస్ ఉంటుంది. మామిడి సాగు చేయడానికి కనీసం 23 డిగ్రీల నుంచి 26 డిగ్రీల టెంపరేచర్ అవసరం. తోకాచి ప్రాంతంలో అది అసాధ్యం. అయితే దీన్ని హిరోయుకి నకగావా సుసాధ్యం చేసి చూపించాడు. చలికాలంలోనూ తన మామిడి తోటలో 36 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత ఉండేలా గ్రీన్‌హౌస్ ను ఏర్పాటు చేయించాడు. అందులోనే మామిడి తోట ఉంటుంది. చలికాలంలో హిరోయుకి నకగావా మంచును పోగుచేసుకుంటాడు. వేసవి నెలలలో దానిని వాడుకొని తన మామిడి తోట ఉన్న గ్రీన్‌హౌస్‌లను చల్లబరుస్తాడు. దీంతో మామిడి పండ్లు పుష్పించేలా మాయ చేస్తాడు. ఇక శీతాకాలంలో అతడు తన గ్రీన్‌హౌస్‌ను వేడి చేయడానికి తోట సమీపంలో ఉన్న సహజమైన వేడి నీటి బుగ్గలలోని నీటి వేడిని ఉపయోగించుకుంటాడు. ఫలితంగా అన్ సీజన్ లో కూడా దాదాపు 5,000 మామిడి పండ్లను పండిస్తున్నాడు. ఈ పద్ధతిలో మామిడి సాగు వల్ల వాటిలో కీటకాలు తక్కువగా ఉంటాయి. పురుగుమందుల, రసాయనాల అవసరం అస్సలు ఉండదు.