Artificial Skin: ఆర్టిఫీషియల్ స్కిన్.. గేమ్ ఛేంజర్

మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. ఇది మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. వాతావరణ మార్పులను మనం ఫీల్ అయ్యేలా చేసేది చర్మమే. చర్మంలో హెయిర్ ఫోలికల్స్, స్వేద గ్రంథులు, సేబాషియస్ గ్రంథులు, నరాలు, శోషరసాలు, రక్త ధమనులు, సబ్కటానియస్ హైపోడెర్మిస్ పొరలు ఉంటాయి. వీటన్నింటి కలయికగా చర్మం తన యాక్టివిటీని జరుపుతుంది.

  • Written By:
  • Publish Date - January 31, 2023 / 01:30 PM IST

మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. ఇది మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. వాతావరణ మార్పులను మనం ఫీల్ అయ్యేలా చేసేది చర్మమే. చర్మంలో హెయిర్ ఫోలికల్స్, స్వేద గ్రంథులు, సేబాషియస్ గ్రంథులు, నరాలు, శోషరసాలు, రక్త ధమనులు, సబ్కటానియస్ హైపోడెర్మిస్ పొరలు ఉంటాయి. వీటన్నింటి కలయికగా చర్మం తన యాక్టివిటీని జరుపుతుంది. ఇటువంటి కీలకమైన చర్మం ఒకవేళ కాలిపోతే.. తీవ్ర గాయాలతో దెబ్బతింటే ? ఎంతో బాధను ఎదుర్కోవాల్సి వస్తుంది. బాడీ లుకింగ్ చెడిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో హెల్ప్ చేసేందుకు అభివృద్ధి చేసిందే కృత్రిమ చర్మం (ఆర్టిఫీషియల్ స్కిన్). దీన్ని జెల్ లాంటి హైడ్రోజెల్, ల్యాబ్ నిర్మిత పదార్థాలు లేదా కొల్లాజెన్ , జెలటిన్, ఇతర సహజ పదార్థాల నుంచి తయారు చేస్తారు. అనుభవజ్ఞులైన చర్మ నిపుణులు కృత్రిమ చర్మాన్ని ల్యాబ్‌లో డెవలప్ చేస్తారు.

కృత్రిమ చర్మం ఎంత మంచిది?

కృత్రిమ చర్మం కూడా సాధారణ చర్మం చేసే అన్ని పనులు చేస్తుంది. ఇది కూడా థర్మో రెగ్యులేషన్, విసర్జన, శోషణ, జీవక్రియ ప్రక్రియలు, ఇంద్రియ, బాష్పీభవన నియంత్రణ, సౌందర్య కార్యకలాపాలలో ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు మీ చర్మంతో ఏదైనా సమస్యను ఎదుర్కొన్నట్లయితే.. దానిని కృత్రిమ చర్మంతో పునరుద్ధరించవచ్చు.  కాలిన గాయాలను కూడా దీంతో నయం చేయొచ్చు. కృత్రిమ చర్మం ఇంకా ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

కాలిన గాయాలు, ఇన్ఫెక్షన్లకు చికిత్స

శరీరంలోని ఏ భాగంలోనైనా కాలిన గాయాలకు కృత్రిమ చర్మం సహాయంతో సులభంగా నయం చేయవచ్చు. రోగికి గాయాన్ని కవర్ చేయడానికి తగినంత మంచి చర్మం లేనప్పుడు.. ఇది ఉపయోగ పడుతుంది. ఒకవేళ కృత్రిమ చర్మంతో చికిత్స చేయకుంటే.. బాడీలో నుంచి గణనీయమైన ద్రవ నష్టం జరుగుతుంది. చర్మ ఇన్ఫెక్షన్లు కూడా పెరుగుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో కృత్రిమ చర్మంతో ట్రీట్మెంట్ బెస్ట్ ఆప్షన్.

తీవ్రమైన చర్మ పరిస్థితులకు పరిష్కారం

చర్మంపై గాయాలకు చికిత్స చేయడానికి కూడా కృత్రిమ చర్మాన్ని ఉపయోగించవచ్చు.  కృత్రిమ చర్మంతో తయారు చేయబడిన Apligraf అనే ఒక ఉత్పత్తి.. అల్సర్లు మొదలైన వాటిని నెమ్మదిగా, దీర్ఘకాలికంగా నయం చేయడానికి దోహదపడుతుంది. ఎగ్జిమా, సోరియాసిస్ వంటి వాటికి కూడా చికిత్స చేసేందుకు ఆర్టిఫీషియల్ స్కిన్ యూజ్ ఫుల్ గా ఉంటుంది. నేచురల్ స్కిన్ ను తలపించేలా మీ దెబ్బతిన్న స్కిన్ ను మార్చే లక్షణం కృత్రిమ చర్మానికి ఉంది.

మానవ చర్మం కంటే మెరుగైన సెన్సింగ్ సామర్థ్యాలున్న స్కిన్

మానవ చర్మం కంటే మరింత సున్నితంగా ఉండే కృత్రిమ చర్మాన్ని సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనికి మానవ చర్మం కంటే మెరుగైన సెన్సింగ్ సామర్థ్యాలు ఉన్నాయని సైంటిస్టులు తెలిపారు.కాలిన గాయాలు , ఇతర చర్మ వ్యాధులతో బాధపడే వారి చికిత్సకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.

సింథటిక్ స్కిన్ తో చర్మ క్యాన్సర్  కణాలకు చెక్

డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌ లోని యూనివర్శిటీ ఆఫ్ కోపెన్‌హాగన్‌కు చెందిన ఒక అధ్యయన బృందం సింథటిక్ మానవ చర్మాన్ని ఉపయోగించడం ద్వారా చర్మ క్యాన్సర్  కణాల పెరుగుదలను ఆపింది.  ఈ అధ్యయనం సైన్స్ సిగ్నలింగ్‌ జర్నల్ లో పబ్లిష్ అయింది. చర్మంలో క్యాన్సర్ కణాలు ఉద్భవించి నప్పుడు, అవి చర్మంలోని వివిధ పొరల మధ్య సరిహద్దులను గౌరవించవు. అవి ఒకదానిపై ఇంకొకటి దాడి చేయడం ప్రారంభిస్తాయి. ఈ ప్రక్రియనే ఇన్వేసివ్ గ్రోత్ అంటారు. దీన్ని నిరోధించడం ద్వారా క్యాన్సర్ కణాల పెరుగుదలకు శాస్త్రవేత్తలు అడ్డుకట్ట వేశారు.

కృత్రిమ చేతులు, కాళ్లకు స్పర్శ ఇచ్చే స్కిన్

చర్మానికి ఉన్న ప్రత్యేక గుణం స్పర్శ జ్ఞానం. స్పర్శ ద్వారా వస్తువులను గ్రహించగలిగే గుణం చర్మానికి ఉంది. వికలాంగులకు అమర్చే కృత్రిమ చేతులు, కాళ్లకు స్పర్శ జ్ఞానం కూడా అందించాలనే బృహత్‌ సంకల్పం పరిశోధకులకు ఏర్పడింది. ఈ దిశ­గా జరుగుతున్న పరిశోధనలు అనేక ఆవిష్కరణలకు దారి తీస్తున్నాయి. బ్రిటన్‌లోని బ్రిస్టల్‌ రొబోటిక్స్‌ లేబొరేటరీకి చెందిన పరిశోధకులు త్రీడీ ప్రింట్‌తో రూపొందించిన కృత్రిమ చర్మాన్ని రోబోల వేళ్లకు తొడగడం ద్వారా స్పర్శ జ్ఞానాన్ని కలిగించడంలో విజయం సాధించగలిగారు.

ఈ కృత్రిమ చ­ర్మం ద్వారా వస్త్రాల నాణ్యత, మృదుత్వం, తేమ వంటి లక్షణాలను పసిగట్టవచ్చు. స్పర్శను ఆస్వాదించగలిగే కృత్రిమ చర్మం తయారీపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ముట్టుకున్నçప్పు­డు వచ్చే ప్రకంపనాల ఆధారంగా కృతిమ మేథ­తో వస్తువులను గ్రహించగలిగే ఈ–స్కిన్‌.. మనిషి స్పర్శజ్ఞానాన్ని అనుకరించగల ప్రత్యామ్నాయ మార్గంగా అవ­తరించబోతోంది.

మనిషి ముట్టుకోలేని అత్యంత వేడి పదార్థాలు, అత్యంత శీతల పదార్థాలు, ప్రమాదకరమైన వస్తువులను ఈ కృత్రిమ చర్మం ద్వారా విశ్లేషించే అవ­కాశం ఏర్పడుతుందని పరిశోధకుల అభి­ప్రా­యం. ‘అకిడా’ప్రాసెసర్‌ అమర్చిన పరి­క­రాలతో రోడ్డు, బ్రిడ్జీలను ముట్టుకొని వా­టి నాణ్య­తను అంచనా వేసే అవకాశం ఏర్పడుతుంది. మనిషి వెళ్లలేని సముద్రగర్భాలు, భూగర్భాల్లో ఈ కృత్రిమ చర్మంగ­ల పరికరాలను పంపడం ద్వారా కొత్త వి­షయాలు తెలుసుకొనే ఆస్కారం ఉందని ఈ రంగంలో పనిచేస్తున్న పరిశోధకులు చెబుతున్నారు.