8 Dishes: ఆ 8 ఫుడ్స్ మన ఇండియన్ కాదండోయ్..!

మనం ఎంతో ఇష్టంగా తినే కొన్ని ఫుడ్స్ మన దేశానివి కాదట.ఆ స్పైసీ, టేస్టీ ఫుడ్స్ మన దేశానికి సొంతమని అందరూ భావిస్తారు. కానీ వాస్తవం వేరు.. వాటి పుట్టుక, తొలిసారి తయారీ ఎక్కడో దూరంగా ఉన్న ఖండంలో జరిగింది.

  • Written By:
  • Publish Date - February 19, 2023 / 01:00 PM IST

మనం ఎంతో ఇష్టంగా తినే కొన్ని ఫుడ్స్ మన దేశానివి కాదట.ఆ స్పైసీ, టేస్టీ ఫుడ్స్ మన దేశానికి సొంతమని అందరూ భావిస్తారు. కానీ వాస్తవం వేరు.. వాటి పుట్టుక, తొలిసారి తయారీ ఎక్కడో దూరంగా ఉన్న ఖండంలో జరిగింది. మన ఇండియాలో మన ఇండియన్ల ఇలా దగ్గరైపోయిన అలాంటి 8 ఫారిన్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!

1. సమోసా

సమోసా గురించి తెలియని ఇండియన్ ఉండడు.అద్భుతమైన టీటైమ్ స్నాక్ ఇది. టిఫిన్ లో దీన్ని ఇష్టంగా తింటారు.  ఈ ప్రసిద్ధ వంటకం మూలాల పర్షియా (ఇరాన్)లో ఉన్నాయి. పర్షియన్ పదం ‘సంబుసక్’ నుంచి హిందీ పదం ‘సమోసా’ వచ్చింది. ఇరాన్ లో తయారు చేసే  సమోసాలలో ముక్కలు చేసిన మాంసం వేస్తుంటారు. కానీ మన దేశంలో సమోసాలో బంగాళదుంపలు, జున్ను, బఠానీలు, అల్లం, వెల్లుల్లి, టమోటాలు, ఉల్లిపాయలు, మిరపకాయలతో నింపుతారు.

2. జిలేబీ

జిలేబీ ని బెంగాల్‌లో జిలాపి, అస్సాంలో జిలేపి అని పిలుస్తారు. ఇది అట్రాక్టివ్ బ్రేక్‌ఫాస్ట్‌, డెజర్ట్‌లలో ఒకటి. తొలిసారిగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో జిలేబీ తయారు చేశారు. అరేబియా వంటల పుస్తకం “కితాబ్ అల్ తబిఖ్”లో ఈవిషయాన్ని ప్రస్తావించారు. అక్కడ అరబిక్ భాషలో జిలేబీని “జలాబీహ్” అని పిలుస్తారు. జిలేబీ రుచిని మరింత పెంచడానికి దాన్ని పెరుగు లేదా రబ్రీ డిష్ తో కలిపి తినాలి.

3. బిర్యానీ

Swiggy, Zomato నుంచి వచ్చిన డేటా ప్రకారం.. భారతీయ గృహాలలో అత్యధికంగా ఆర్డర్ చేయబడిన భోజనం బిర్యానీ. అలా అని బిర్యానీ మన ఇండియన్ డిష్ కాదు.  దీని మూలాలు ఖచ్చితంగా తెలియనప్పటికీ.. మొఘలులే బిర్యానీని మన ఇండియన్స్ కు పరిచయం చేశారని చెబుతారు. మొఘల్ చక్రవర్తుల వంటశాలలలో బిర్యానీ తయారు చేసేవారని అంటారు.

4. విందాలూ

విందాలూ.. దీన్ని విందాల్హు అని కూడా పిలుస్తారు. ఇది గోవాలోని ఒక ప్రసిద్ధ వంటకం. దీని మూలం పోర్చుగీస్ వంటకం ‘కార్నే డి విన్హా డి’అల్హోస్’లో ఉంది. వాస్తవానికి విందాలూలో వెల్లుల్లి లేదా వెనిగర్‌లో మెరినేట్ చేసిన పంది మాంసం వాడుతారు. ఉంటుంది. కానీ మన దేశంలో దీన్ని చికెన్ తో తయారు చేస్తారు.

5. చికెన్ టిక్కా మసాలా

ప్రవాస భారతీయులు ప్రత్యేకించి UKలో నివసిస్తున్నవారు చికెన్ టిక్కా మసాలాపై ఆసక్తి చూపుతున్నారు. వాస్తవానికి చికెన్ టిక్కా మసాలా మన ఇండియన్ డిష్ కాదు! షాకింగ్, సరియైనదా?!  దీనిని 20వ శతాబ్దపు చివరిలో స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో బంగ్లాదేశ్ చెఫ్ తయారు చేశాడని అంటారు. తన కస్టమర్‌ని సంతోషపెట్టడానికి, అతను తన బోన్‌లెస్ చికెన్‌లో టొమాటో సాస్‌ని జోడించాడని చెబుతారు.

 6. రాజ్మా

రాజ్మా చావల్ అనేది ఉత్తర భారతీయులకు ఎంతో ఇష్టం. ముఖ్యంగా పంజాబీ గృహాలలో ఇది హాట్ డిష్. దీని మూలాలు మెక్సికోలో ఉన్నాయి. ఈ డిష్ ను పోర్చుగీస్ నావికులు ఉత్తర అమెరికాకు.. అక్కడి నుంచి ఐరోపాకు తీసుకెళ్లారని నమ్ముతారు.

7.గులాబ్ జామూన్‌

గులాబ్ జామూన్‌ కు ఇండియన్స్ ఫిదా అవుతారు. లొట్టలు వేస్తూ తింటారు. ఈ గోధుమరంగు, జ్యుసి బంతి భారతీయ వంటకం అని చాలామంది నమ్ముతారు. అయితే ఇది వాస్తవానికి పర్షియా/మధ్యధరా ప్రాంతానికి చెందినది. టర్కిష్ పాలకుల ద్వారా అది మన భారతదేశానికి వచ్చిందని అనేందుకు ఆధారాలు ఉన్నాయి.  ‘గులాబ్ జామున్’ అనే పదం ‘గోల్’ మరియు ‘అబ్’ అనే పర్షియన్ పదాల నుంచి ఏర్పడింది. వాటి అర్ధం.. ‘సువాసన గల రోజ్ వాటర్’.
పర్షియా/మధ్యధరా ప్రాంతంలో వండే గులాబ్ జామూన్ తయారీలో చక్కెరకు బదులు తేనె వాడుతారు.

8. టీ

ప్రపంచంలో టీ ఉత్పత్తిలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. రుచికరమైన కప్పు టీ లేకుండా మన ఉదయాలు ప్రారంభం కావు. అయితే చాయ్ పుట్టింది చైనాలో అని మీకు తెలుసా? హాన్ రాజవంశానికి చెందిన చైనీస్ చక్రవర్తి సమాధిలో పురాతన టీ అవశేషాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది టాంగ్ రాజవంశం పాలనలో చైనీస్ రాయల్టీలలో ఒక ప్రసిద్ధ పానీయం. చాయ్ చారిత్రాత్మక సిల్క్ మార్గం ద్వారా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు పాకింది.  భారత దేశంలోని ఈశాన్య ప్రాంతంలో బ్రిటిష్ వారు టీ తోటలు సాగు చేశారు.