Woman Raped : కదులుతున్న రైలులో ఓ మహిళపై ఇద్దరు యువకులు అత్యచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన అస్సాం నుంచి పశ్చిమబెంగాల్ వెళుతున్న సిఫాంగ్ (Sifang Express) రైల్లో జరిగింది. దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు ఆగడంలేదు. ముఖ్యం గా ఉత్తర రాష్ట్రాల్లో ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి. కోర్టులు , పోలీసులు ఎంత కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ కామాంధుల్లో మార్పు రావడం లేదు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటన అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉంది.
రీసెంట్ గా ఉత్తర ప్రదేశ్ లో సుబేదార్ గంజ్ ఎక్స్‌ప్రెస్(SUBEDAR GANJ EXPRESS)లో 33 ఏళ్ల మహిళ తన రెండేళ్ల కుమారుడితో ప్రయాణం చేస్తుండగా..ఆమెను ఏసీ లో కూర్చోమని చెప్పి..మత్తుమందు కలిపినా నీరు తాగించి, ఆ తర్వాత టీటీఈ రాజు సింగ్.. మరో వ్యక్తి కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి (Gang Raping) పాల్పడ్డారు. ఈ ఘటన సంచలనంగా మారగా..ఈ ఘటన గురించి ప్రయాణికులు మాట్లాడుతుండగానే తాజాగా అస్సాం నుంచి పశ్చిమబెంగాల్ వెళుతున్న సిఫాంగ్ రైల్లో మరో అత్యాచార ఘటన అందర్నీ భయబ్రాంతులకు గురి చేస్తుంది.
తన కుమారుడితో కలిసి ఓ మహిళా గువహటి(అస్సాం) నుంచి అలీపూర్‌ద్వార్(పశ్చిమబెంగాల్) వెళుతున్న సిఫాంగ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కింది. రైలు ఫకీరాగ్రామ్ చేరుకునే సరికి బోగీ అంత దాదాపు ఖాళీ అయిపోయింది. ఈ క్రమంలో అదే బోగీలో ప్రయాణిస్తున్న అస్సాం వాసులు అబు(25), మొయినుల్ హక్(26) బాధిత మహిళపై కన్నేశారు. ఆమె దగ్గరకు వచ్చి,,బిడ్డను రైల్లోంచి తోసేస్తామని..మాకు సహకరించాలని బెదిరించారు. ఆమె ఒప్పుకోకపోయేసరికి కట్టేసి కొట్టారు. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. రైలు అలీపూర్‌ద్వార్ జంక్షన్(Alipur Duar Junction) కు చేరుకున్నాక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత పిర్యాదు మేరకు పోలీసులు శనివారం ఆ ఇద్దర్ని అరెస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ ఘటన గురించి అంత మాట్లాడుకుంటూ..ఒంటరిగా మహిళలు ప్రయాణం చేయాలన్న..ఎక్కడికైనా వెళ్లాలన్న ..వెళ్లలేని పరిస్థితి వచ్చిందని అనుకుంటున్నారు.
Read Also : Punganur : పుంగనూరు అల్లర్లలో మరో తొమ్మిది మంది అరెస్ట్