కోవిడ్ తో చనిపోయినవాళ్లందరికీ రూ. 50 వేల పరిహారం

కొవిడ్ కారణంగా ఎంతోమంది రోడ్డున పడ్డారు. మరెంతోమంది అనాథలుగా మారారు. పేద, ధనిక అనే పెద్దా తేడా లేకుండా చాలామంది ఆ మహమ్మారికి బలయ్యారు. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలెన్నో ఇబ్బందులు పడ్డారు. కొవిడ్ తో బంధువునో, ఫ్యామిలీ మెంబరో మరణిస్తే.. చివరకు అంత్యక్రియలు చేయడానికి కూడా అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కరోనా విళయతాండవంపై కీలక వాఖ్యలు చేసింది.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:27 PM IST

కొవిడ్ కారణంగా ఎంతోమంది రోడ్డున పడ్డారు. మరెంతోమంది అనాథలుగా మారారు. పేద, ధనిక అనే పెద్దా తేడా లేకుండా చాలామంది ఆ మహమ్మారికి బలయ్యారు. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలెన్నో ఇబ్బందులు పడ్డారు. కొవిడ్ తో బంధువునో, ఫ్యామిలీ మెంబరో మరణిస్తే.. చివరకు అంత్యక్రియలు చేయడానికి కూడా అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కరోనా విళయతాండవంపై కీలక వాఖ్యలు చేసింది. దేశంలో కరోనాతో చనిపోయినా ప్రతిఒక్కరికీ రూ.50 వేల సాయం అందించాలని స్పష్టం చేశారు. ఈ మేరకుదేశంలో కోవిడ్ -19 కారణంగా మరణించిన వారందరికీ రూ .50,000 ఎక్స్ గ్రేషియా పరిహారం అందించే కేంద్రం పథకాన్ని సుప్రీం కోర్టు ఆమోదించింది.

కొవిడ్ తో ఆప్తులను, కుటుంబ సభ్యులను ప్రభుత్వమే ఆదుకోవాలని కొంతమంది బాధితులు కోర్టును ఆశ్రయించారు. కోవిడ్ -19 బాధితులకు ఎక్స్ గ్రేషియా పరిహారం చెల్లించడానికి మార్గదర్శకాలను రూపొందించాలని, ఎన్‌డిఎమ్‌ఎను ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజాగా ఆర్డర్ ఇచ్చింది. సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ ఎంఆర్ షా మాట్లాడారు. మరణించిన వారి సమీప బంధువులకు రూ .50 వేలు చెల్లించాల్సి ఉంటుందని, కేంద్ర, రాష్ట్రాలకు విధిగా బాధితులకు పరిహరం అందించాలన్నారు.

కొవిడ్ వల్ల పలు రాష్ట్రాల్లో లెక్కకు మంచి మరణాలు సంభవించాయి. అయతే కొన్ని రాష్ట్రాలు సహజ మరణాల కింద భావించాయి. ఈ నేపథ్యంలో జస్టిస్ ఎంఆర్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మరణ ధృవీకరణ పత్రంలో మరణానికి కారణం కోవిడ్ -19 కాదనే కారణంతో రూ .50,000 సాయాన్ని ఏ రాష్ట్రం ఆపకూడదని స్పష్టం చేసింది. ఇందుకోసం జిల్లాధికారులు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర విపత్తు సహాయ నిధుల నుంచి చెల్లింపు ఉంటుందని సుపీరంకోర్టు కోర్టు తెలిపింది. దరఖాస్తు చేసిన 30 రోజుల్లోగా పరిహార మొత్తాన్ని పంపిణీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. రోగి వైద్య రికార్డులను పరిశీలించి, 30 రోజుల్లోపు కాల్ చేసి పరిహారాన్ని ఆదేశించవచ్చని కోర్టు తెలిపింది.