Sudha Murty : రాజ్య‌స‌భ ఎంపీగా ప్ర‌మాణ స్వీకారం చేసిన సుధా మూర్తి

  • Written By:
  • Publish Date - March 14, 2024 / 02:10 PM IST

 

Sudha Murty: ఇన్‌ఫోసిస్ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్ఆర్ నారాయ‌ణ మూర్తి(NR Narayana Murthy) భార్య సుధా మూర్తి(Sudha Murty) ఈరోజు రాజ్య‌స‌భ ఎంపీగా(Rajya Sabha MP) ప్ర‌మాణ స్వీకారం చేశారు. రాజ్య‌స‌భ చైర్మెన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్(Jagdeep Dhankar)త‌న ఛాంబ‌ర్‌లో ఆమె చేత ప్ర‌మాణం చేయించారు. లీడ‌ర్ ఆఫ్ ద హౌజ్ పీయూష్ గోయ‌ల్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. సుధా మూర్తి వ‌య‌సు 73 ఏళ్లు. ఇన్‌ఫోసిస్‌లో మాజీ చైర్మెన్‌గా చేశారు. అనేక పుస్త‌కాలు రాశారామె. ఎక్కువ‌గా చిన్న పిల్ల‌ల‌పై పుస్త‌కాలు రాశారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా గ‌త శుక్ర‌వారం రాజ్య‌స‌భ‌కు సుధామూర్తిని నామినేట్ చేశారు. క‌న్న‌డ‌, ఆంగ్ల సాహిత్యంలో అనేక ర‌చ‌న‌లు చేశారు. సాహిత్య అకాడ‌మీ బాల్ సాహిత్య పుర‌స్కార్ అందుకున్నారు. 2006లో ఆమెకు ప‌ద్మ‌శ్రీ అంద‌జేశారు. 2023లో ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారాన్ని అందుకున్నారు. టెల్కో కంపెనీలో ప‌నిచేసిన తొలి మ‌హిళా ఇంజినీర్‌గా సుధామూర్తికి గుర్తింపు ఉన్న‌ది. ఇన్‌ఫోసిస్ మొద‌లుపెట్టేందుకు త‌న ఎమ‌ర్జెన్సీ ఫండ్ నుంచి ఆమె ప‌దివేలు తీసి భ‌ర్త‌కు ఇచ్చారు. ఇప్పుడు ఆ కంపెనీ విలువ సుమారు 80 బిలియ‌న్ల డాల‌ర్లు. సుధా మూర్తి కుమార్తె అక్ష‌త .. బ్రిటీష్ ప్ర‌ధాని రిషి సునాక్‌ను పెళ్లి చేసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, తనను రాజ్యసభ (Rajya Sabha)కు నామినేట్‌ చేయడం పట్ల ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి (Sudha Murty) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu)కు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ఈ అవకాశం కల్పించడం తనకు ఇచ్చిన పెద్ద బహుమతి అని.. దేశం కోసం పనిచేయడం కొత్త బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు.

read also : Kurnool MP Sanjeev Kumar : టీడీపీ లో చేరిన వైసీపీ ఎంపీ ..