Aircraft Emergency Landing : బెంగళూరులో విపక్ష పార్టీల మీటింగ్ ముగిసిన అనంతరం కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మంగళవారం సాయంత్రం న్యూఢిల్లీకి చార్టెడ్ విమానంలో బయలుదేరారు. అయితే ఆ విమానం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని రాజా భోజ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అయితే ఈవిషయం ఆలస్యంగా బయటికి వచ్చింది. “ఇది ప్రాధాన్య ల్యాండింగ్ మాత్రమే.. అత్యవసర ల్యాండింగ్ కాదు” అని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రామ్‌జీ అవస్తి చెప్పారు. “ఆ విమానం అత్యవసర ల్యాండింగ్ (Aircraft Emergency Landing) చేయబడింది” అని భోపాల్ పోలీసు కమిషనర్ హరినారాయణ్ చారి మిశ్రా తెలిపారు. “సాంకేతిక లోపం వల్ల విమానం అనుకోని టచ్ డౌన్‌కు దారితీసింది” అని ఒక కాంగ్రెస్ నాయకుడు చెప్పారంటూ ఓ మీడియా సంస్థ కథనాన్ని పబ్లిష్ చేసింది.
Also read : Llama 2 AI Chatbot : చాట్ జీపీటీ, బార్డ్ కు పోటీగా “లామా 2”.. జుకర్ బర్గ్ మరో ఆవిష్కరణ
చార్టెడ్ విమానం ల్యాండింగ్ పై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మధ్యప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ శోబా ఓజా మాట్లాడుతూ.. “సోనియా జీ, రాహుల్ జీ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం కొంత సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా ల్యాండ్ అయింది ” అని అన్నారు. ఈ పరిణామంపై సమాచారం అందుకున్న ఓజా, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ పచోరీ, ఎమ్మెల్యేలు పీసీ శర్మ, ఆరిఫ్ మసూద్, కునాల్ చౌదరి సహా సీనియర్ కాంగ్రెస్ నేతలు విమానాశ్రయానికి చేరుకుని లాంజ్‌లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Also read : India in Asia Cup: ఆసియా కప్ టోర్నీలో టీమిండియాదే పైచేయి.. ఇప్పటివరకు 7 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత్..!