Site icon HashtagU Telugu

RCB : చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట..10 మంది మృతి

Seven killed in stampede at Chinnaswamy Stadium

Seven killed in stampede at Chinnaswamy Stadium

RCB : ఆర్సీబీ అభిమానుల ఆనందం ఓ విషాద ఘటనకు దారితీసింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్‌ ట్రోఫీని తొలిసారి గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవాలు కన్నీటిలో ముగిశాయి. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఘన సన్మాన కార్యక్రమం విషాదంగా మారింది. భారీగా తరలివచ్చిన అభిమానుల గుంపులో తొక్కిసలాట జరగడంతో 10మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, 13 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ రోజు సాయంత్రం, ఆర్సీబీ విజయాన్ని పురస్కరించుకుని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నస్వామి స్టేడియంలో ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరు నగరం అంతా ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది. వేలాదిమంది అభిమానులు ఎర్ర జెండాలు చేతబూని స్టేడియానికి చేరుకున్నారు. అయితే, భద్రతా ఏర్పాట్లు తక్కువగా ఉండటంతో సంఘటన అణచివేయలేనిది అయింది.

Read Also: Axar Patel: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అక్ష‌ర్ ప‌టేల్‌.. అస‌లు నిజం ఇదే!

గేట్ నెంబర్-2 వద్ద ఒకేసారి పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, పరిస్థితి అదుపు తప్పింది. అభిమానులు గోడలు, చెట్లు ఎక్కుతూ లోపలికి చొరబడ్డారు. పోలీసులు జనం అదుపులోకి తేవడానికి లాఠీచార్జ్ చేయగా, గందరగోళం మితిమీరింది. ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో పలువురు నేలకొరిగి పడిపోయారు. ఈ క్రమంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారి లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడినవారిలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ విషాద ఘటనపై కర్ణాటక ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ, బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని, ఘటనపై విచారణకు ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. “ఆర్సీబీ విజయం రాష్ట్రానికి గర్వకారణం అయినా, ఈ విధమైన ఘటన జరగడం ఎంతో బాధాకరం,” అని ఆయన అన్నారు. ఆర్సీబీ ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికేందుకు వేలాది మంది అభిమానులు వస్తారని అంచనా వేసినా, నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయకపోవడమే ఈ విషాదానికి కారణమని పలువురు విమర్శిస్తున్నారు. చిన్నస్వామి స్టేడియం వద్ద పోలీసు బందోబస్తు తక్కువగా ఉండటం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. ఇటువంటి ఘటనలు ఇక పునరావృతం కాకుండా చూడాలంటే, సముచిత భద్రతా చర్యలు తీసుకోవడమే కాక, జనసంచారాన్ని నియంత్రించే వ్యవస్థలు మెరుగుపరచాలి. ఐపీఎల్ విజయం ఎంతో గొప్పదైనా, ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానుల్లో విషాదాన్ని నింపింది. కాగా, అధికారికంగా 10 మంది మృతి  చెందంగా  మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉంది .. 13మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తుంది.

Read Also: AP Cabinet : ఏపీ క్యాబినెట్‌ నిర్ణయాలివే..