Atiq Ahmad: సీఎం యోగి ఇంటి వద్ద భారీగా పోలీసులు

ఉత్తరప్రదేశ్ కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీఖ్ అహ్మద్ పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపగా అతీఖ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు

Atiq Ahmad: ఉత్తరప్రదేశ్ లో కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీఖ్ అహ్మద్ పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపగా అతీఖ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అరెస్టై జైలులో ఉన్న అతీక్ అహ్మద్ ను మెడికల్‌ చెకప్‌ కోసం ప్రయాగ్ రాజ్ లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో అతీక్‌ సోదరుడు అష్రాఫ్‌ అహ్మద్‌ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అతీక్ పై సుమారు 100కు పైగా కేసులున్నాయి.

ప్రయాగ్‌రాజ్‌లోని చెక‌ప్ కోసం ఆసుప‌త్రికి వెళ్లిన అతిక్ అత‌ని సోద‌రుడు మీడియాతో మాట్లాడుతుండ‌గా గుర్తు తెలియ‌ని ముగ్గురు వ్య‌క్తులు జ‌ర్న‌లిస్టుల బృందంలో చేరారు. దుండ‌గుల్లో ఒక‌రు అతిక్ త‌ల‌పై పిస్ట‌ల్ గురిపెట్టి దారుణంగా కాల్చి చంపారు. మ‌రో ఇద్ద‌రు దుండగులు అతిక్ సోద‌రుడిపై కాల్పులు జ‌రిపారు. కాల్పులు త‌ర్వాత దుండ‌గులు చేతులు పైకెత్తి పోలీసుల‌కు లొంగిపోయారు. అతీక్ అహ్మద్ ఓ రాజకీయ నాయకుడు. ఆయన గతంలో సమాజ్ వాదీ పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. అంతకుముందు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ మర్డర్ కేసులో అతీక్​ నిందితుడిగా ఉన్నాడు.

కాగా ఈ ఘటన జరిగిన తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఘటనపై దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. అతీఖ్ అహ్మద్, ఆయన సోదరుడి హత్య నేపథ్యంలో సీఎం యోగి నివాసానికి భారీగా భద్రతను పెంచారు పోలీసులు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. విశేషం ఏంటంటే ఈ ఘటన అనంతరం 17 మంది పోలీసులు సస్పెండ్ అయ్యారు.

Read More: Virat Kohli- Ganguly: మరోసారి బయటపడ్డ కోహ్లీ-గంగూలీ మధ్య విభేదాలు.. గంగూలీకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కోహ్లీ నిరాకరణ.. వీడియో వైరల్..!