PM Modi-NewYork hotel : అమెరికా టూర్ లో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం ఎక్కడున్నారు ?
ఆయన ఎక్కడ బస చేస్తున్నారు ?
అంటే.. ఇప్పుడు మోడీ న్యూయార్క్‌లోని మాడిసన్ అవెన్యూ ఏరియాలో ఉన్నారు.
1882 నుంచి ఉన్న 563 అడుగుల ఐకానిక్ హోటల్ “లోట్టే న్యూయార్క్ ప్యాలెస్”లో భారత ప్రధాని బస చేస్తున్నారు.
ప్రపంచంలోనే ధనిక వ్యక్తి, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ సహా ఎందరో ప్రముఖులు ఈ హోటల్ కు వచ్చి మోడీతో భేటీ అయ్యారు.
లోట్టే న్యూయార్క్ ప్యాలెస్ విశేషాలు
- లోట్టే న్యూయార్క్ ప్యాలెస్( Lotte New York Palace) న్యూయార్క్‌లోని ప్రసిద్ధ హోటల్.
- ఈ హోటల్ ను 1882లో నిర్మించారు.
- దీని ఎత్తు 563 అడుగులు.
- హోటల్ లో 51 అంతస్తులు ఉన్నాయి.
- 1992లో ఈ హోటల్‌ను బ్రూనై సుల్తాన్ కొన్నారు. 2011లో ఈ హోటల్‌ను నార్త్‌వుడ్ ఇన్వెస్టర్లకు విక్రయించారు.
- 2015లో దక్షిణ కొరియాకు చెందిన Lotte Hotels and Resorts ఈ లగ్జరీ హోటల్‌ని కొని ప్రస్తుతమున్న పేరును పెట్టింది.
- ఈ హోటల్ లో 800 గదులు ఉన్నాయి.
- ఈ హోటల్ లో ఒక రాత్రికి రెంట్ రూ. 48,000 నుంచి రూ. 12.15 లక్షల దాకా ఉంటుంది.
న్యూయార్క్ లో ప్రోగ్రామ్స్ ముగియగానే.. ప్రధాని మోడీ వాషింగ్టన్ కు వెళ్లి అధ్యక్షుడు బైడెన్ తో చర్చలు జరుపుతారు. ప్రధాని మోడీకి బైడెన్ దంపతులు జూన్ 22న వైట్ హౌస్ లో అధికారిక విందు ఇవ్వనున్నారు.
Also read : Tesla: ఇండియాలోకి టెస్లా? మోడీతో మస్క్ భేటీతో డీల్!