Site icon HashtagU Telugu

Kerala State : కేరళ పేరు మారింది.. ఇకపై అది ‘కేరళం’

Kerala Government To Seek Official Name Change To 'keralam

Kerala Government To Seek Official Name Change To 'keralam

కేరళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రానికి కేరళ (Kerala) పేరును కాస్త ‘కేరళం’ (Keralam)గా మార్చాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు పేరు మార్పు ఫై సీఎం పినరయి విజయన్ (Chief Minister Pinarayi Vijayan) ప్రవేశపెట్టిన తీర్మానానికి రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది.

కేర‌ళ రాష్ట్రానికి సంబంధించి కేర‌ళ పేరు వాడ కూడద‌ని , దాని పేరు మార్చాల‌ని అనుకున్న‌ట్లు స‌భ సాక్షిగా ప్ర‌క‌టించారు. కేరళను పూర్వం నుంచే మలయాళం (Malayalam)లో కేరళం అని పిలిచేవారని గుర్తు చేశారు. అయితే మలయాళం కాకుండా ఇతర భాషల్లో మాత్రం ప్రస్తుతం కేరళ అని పిలుస్తున్నారని పేర్కొన్నారు. మలయాళం మాట్లాడే ప్రజల కోసం యునైటెడ్ కేరళ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ స్వాతంత్ర్య పోరాటం జరిగిన కాలం నుంచే ఉందని వివరించారు. ఈ మేర‌కు కేర‌ళ రాష్ట్రం పేరును కేర‌ళంగా మారుస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని అధికారిక భాషల్లోనూ కేరళ పేరును కేరళంగా సూచించాలని ఈ తీర్మానంలో ప్రస్తావించారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ఆమోదించగా.. విపక్షాలు కూడా సవరణ, మార్పులు చేయాలని ఎలాంటి సూచనలు చేయలేదు. దీంతో స్పీకర్‌ ఏఎన్ షంషీర్‌.. ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఇక నిన్న మంగళవారం కూడా కేరళ అసెంబ్లీ ఓ తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. యూనిఫామ్ సివిల్ కోడ్‌ను వ్యతిరేకిస్తూ.. సీఎం పినరయి విజయన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి కేరళ శాసనసభ ఆమోదం తెలిపింది.

Read Also : Gaddar: ప్రగతి భవన్ బయట గద్దర్.. కేసీఆర్ నీకిది తగునా ?