Site icon HashtagU Telugu

Jobs With Ms Excel : MS EXCEL వస్తే..ఎక్సలెంట్ జాబ్స్

Jobs With Ms Excel

Jobs With Ms Excel

Ms Excel.. ఈ కంప్యూటర్ కోర్సును తక్కువ అంచనా వేయొద్దు.. 

ఇది నేర్చుకుంటే ఏవో చిన్నపాటి ఆఫీస్ జాబ్స్ వస్తాయని అనుకుంటే.. మీరు తప్పులో కాలేసినట్టే !!

ఈ కోర్సు నేర్చుకున్న ఎంతోమంది ఎక్కువలో ఎక్కువగా సంవత్సరానికి 7 లక్షల రూపాయల దాకా శాలరీ తీసుకుంటున్నారు. 

ఇంతకీ  Ms Excel(Jobs With Ms Excel) కోర్సు చేశాక వచ్చే ఎక్సలెంట్ జాబ్స్ ఏమిటి ? వాటిలో శాలరీ ఎంత వస్తుంది ? గ్రోత్ ఎలా ఉంటుంది ?  అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..  

చదువు పూర్తి చేసుకొని జాబ్స్ కోసం సెర్చ్ చేసే వారికి కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. ఇప్పుడు ఇది మినిమం రిక్వైర్‌మెంట్‌గా మారింది. Ms Excel అంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్.  దీనికి సంబంధించిన షార్ట్‌టర్మ్, లాంగ్‌టర్మ్ కోర్సులు ఉన్నాయి.  మీకు ఉన్న టైం.. మీ దగ్గరున్న డబ్బు ఆధారంగా ఏ తరహా  Ms Excel కోర్సు చేయాలో డిసైడ్ చేసుకోండి. ఎంపిక చేసుకున్న కోర్సును సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయండి. ఆ తర్వాత మీకు ఎన్నో అవకాశాలు(Jobs With Ms Excel) లభిస్తాయి. ఆ వివరాల్లోకి వెళితే..

Ms Excel కోర్సుపూర్తి చేసిన వారు ఫైనాన్షియల్ అనలిస్ట్ కావచ్చు. కంపెనీకి సంబంధించిన న్యూమరికల్ డేటాను పరిశోధించడం, ఇంటిగ్రేట్ చేయడం, విశ్లేషించడం అనేవి  ఫైనాన్షియల్ అనలిస్ట్ బాధ్యతలు. వీరి సంవత్సర శాలరీ రూ.6 లక్షల దాకా ఉంటుంది. బిజినెస్ అనలిస్ట్ అనే మరో జాబ్ కూడా Ms Excel  వచ్చిన వాళ్లకు ఇస్తారు. ఈ జాబ్ రోల్ లో ఉండేవారు కంపెనీ  వ్యాపారాన్ని అనలైజ్ చేస్తూ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. బిజినెస్ ప్రాసెస్, అంచనా వివరాలని సిద్ధం చేసి ఇవ్వడమే బిజినెస్ అనలిస్ట్  బాధ్యతలు. వీరి యానువల్ శాలరీ రూ.7లక్షల దాకా ఉంటుంది.

also read : SSC CHSL 2023 : ఇంటర్ పాస్ అయ్యారా..1600 జాబ్స్ మీకోసమే

Ms Excel కోర్సుపూర్తి చేసిన వారు ఆపరేషన్స్ అనలిస్ట్ జాబ్ కూడా చేయగలరు.  సంస్థ సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు అవసరమైన  డేటాను అనాలసిస్‌ చేసే నిపుణులను ఆపరేషన్స్ అనలిస్ట్ అంటారు. ఈ జాబ్ చేసే వారికి యానువల్ శాలరీ రూ.5 లక్షల దాకా ఉంటుంది.

 కంపెనీ బిజినెస్‌కు సంబంధించిన ప్రతి లెవల్‌లో ఎన్నో ఆపరేషనల్ యాక్టివిటీస్‌ ఉంటాయి. వాటిపై ఫోకస్ పెట్టి పనిచేయడమే ఆపరేషన్స్ మేనేజర్ బాధ్యత. ఈ జాబ్‌ వస్తే  రూ.8 లక్షల దాకా యానువల్ శాలరీ వస్తుంది. Ms Excel కోర్సుపూర్తి చేసిన వారు ఇది చేయగలరు.

also read : Government Jobs for Engineers: నెలకు రూ.1.80 లక్షల జీతం.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గవర్నమెంట్ జాబ్స్

ఏ కంపెనీకి అయినా సేల్స్ ముఖ్యం. సేల్స్ పెరిగితేనే ఏ సంస్థ అయినా డెవలప్ అవుతుంది. ఇందుకోసం కంపెనీలు  సేల్స్‌పర్సన్స్ ను నియమించుకుంటాయి.సేల్స్‌పర్సన్స్ తో కూడిన టీమ్‌లకు బాధ్యత వహించే వ్యక్తిని  సేల్స్ మేనేజర్ అంటారు.ఈ పోస్టులో ఉన్నవారు  సేల్స్ పెంచడానికిగానూ  టీమ్ మెంబర్స్‌కు అవసరమైన సూచనలు ఇస్తారు. తద్వారా కంపెనీ ఆదాయం  పెంచుతారు. ఈ జాబ్‌ చేసే వారికి రూ.6లక్షల దాకా యనువల్ శాలరీ వస్తుంది. తమ సంస్థ వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడం కూడా  అకౌంట్ మేనేజర్ పనే. ఈ రోల్ లో ఉన్నవారికి యానువల్ శాలరీ రూ.8 లక్షల దాకా వస్తుంది. Ms Excel కోర్సు పూర్తి చేసిన వారు ఇది చేయగలరు.