ఆ మరకలను శుభ్రం చేయడానికి 1200 కోట్లు ఖర్చు చేస్తున్నారా?

కారు, బస్సు, టూవీలర్.. వీటిలో ఎన్ని గంటలు ప్రయాణం చేసినా రాని అనుభూతి ట్రైన్ జర్నీతో పొందవచ్చు. రైలు ప్రయాణమంటే ఆద్యంతం ఆహ్లదంగా ఉంటుంది మరి. విండో సీట్ పక్కన కూర్చొని పచ్చని పొలాలు, నదులను చూస్తుంటే ఎన్ని గంటలయినా జర్నీ చేయాలనిపిస్తుంటుంది ఎవరికైనా. అయితే

  • Written By:
  • Publish Date - October 12, 2021 / 12:40 PM IST

కారు, బస్సు, టూవీలర్.. వీటిలో ఎన్ని గంటలు ప్రయాణం చేసినా రాని అనుభూతి ట్రైన్ జర్నీతో పొందవచ్చు. రైలు ప్రయాణమంటే ఆద్యంతం ఆహ్లదంగా ఉంటుంది మరి. విండో సీట్ పక్కన కూర్చొని పచ్చని పొలాలు, నదులను చూస్తుంటే ఎన్ని గంటలయినా జర్నీ చేయాలనిపిస్తుంటుంది ఎవరికైనా. అయితే ట్రైన్ జర్నీ ఎంత ఎంజాయ్ మెంట్ ఇస్తుందో, రైలు బోగీలు, గోడల, పరిసర ప్రాంతాలు అంతకంటే ఎక్కువ విసుగును తెప్పిస్తున్నాయి. ఎటూ చూసినా ఉమ్మేసిన పాన్, మసాలా మరకలే కనిపిస్తుంటాయి. రైల్వే స్టేషన్ ప్రాంతాలే కాదు.. బోగీలు సైతం గుట్కా, పాన్ మరకలతోనే దర్శనమిస్తున్నాయి. వీటిని శుభ్రం చేయడానికి కేంద్ర రైల్వే శాఖకు తలనొప్పిగా మారింది. కేవలం గుట్కా, పాన్ మరకలను శుభ్రం చేసేందుకు రైల్వేశాఖ ప్రతి ఏడాది 1200 కోట్లు ఖర్చుచేస్తుందట.

ఒకవైపు కొవిడ్ మహమ్మారి, ఇంకోవైపు అందహీనంగా మారుతున్న రైల్వే పరిసర ప్రాంతాల కారణంగా ఇండియన్ రైల్వే శాఖ సరికొత్త ఐడియాను తీసుకొచ్చింది. రైల్వే స్టేషన్లలో ఉమ్మివేయకుండా ‘బయోడిగ్రేడబుల్’ ప్యాకెట్ సైజ్ లాంటి స్పిట్టూన్స్ అందించినప్పటికీ ఇండియన్ రైల్వేశాఖ లక్ష్యం ఏమాత్రం నెరవేరడం లేదు. గుట్కా, పాన్ తిని ఉమ్మేయకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఆశించినా ఫలితాలు రావడం లేదు. ఈ మరకలతో నిండిఉన్న రైల్వే పరిసరాలను శుభ్రం చేసేందుకు ఇండియన్ రైల్వేశాఖ దాదాపు 1200 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా వేసింది.

చాలామంది కొన్ని గంటలు, రోజులు కూడా జర్నీ చేస్తారు. అలాంటివాళ్లలో కొంతమంది గుట్కా, పాన్ తినడం అలవాటు ఉంటుంది. జర్నీ సమయంలో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వేశాఖ నార్త్, వెస్ట్ జోన్స్ పరిధిలోని 42 స్టేషన్లలో వెండింగ్ మెషీన్స్ అలాంటి స్టార్టప్స్ ప్రవేశపెట్టింది. ఎవరైతే ప్రయాణికులు గుట్కా, పాన్ నములుతారో.. అలాంటివాళ్లందరికీ ఈజీస్పిట్ ను అందిస్తున్నారు. దీని కేవలం 5 నుంచి 10 రూపాయల వరకు మాత్రమే ఉంటుంది. ఈ వీటిని ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ప్రయాణాల్లోనూ తమ పాకెట్ లో క్యారీ చేయొచ్చు. స్పిట్ టూన్స్ వాడిన తర్వాత ఎక్కడైనా పడేస్తే, అందులోని మొక్కలు మొలకెత్తి పర్యావరణానికి కూడా మంచిచేస్తాయి. నాగాపూర్ కు చెందిన ఓ కంపెనీ స్పిట్ టూన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ఇండియన్ రైల్వే శాఖతోనూ ఒప్పందం కుదుర్చుకుందట. ఈ స్పిట్టూన్స్ అందుబాటులోకి వస్తే పాన్, గుట్కా మరకలను కొంతవరకైనా అరికట్టవచ్చును.