First Budget in India : ఇండియాలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది ఎవరో తెలుసా..?

  • Written By:
  • Publish Date - February 1, 2024 / 07:15 AM IST

మరికాసేపట్లో కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ (Budget 2024)ను ప్రవేశ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) ఈ మధ్యంతర బడ్జెట్‌ (Interim Budget
)ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మధ్యంతర బడ్జెట్‌ ఫై సామాన్య ప్రజలు కోటి ఆశలతో ఉన్నారు. అసలు ఇండియా లో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది ఎవరో మీకు తెలుసా..?

స్కాట్లండ్‌కు చెందిన వ్యాపారవేత్త, ఆర్థికవేత్త, లిబరల్ నేత జేమ్స్ విల్సన్ (James Wilson) 164 ఏళ్ల క్రితం తొలి బడ్జెట్ (Introducing a financial budget in India) ను ప్రవేశ పెట్టారు. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి ఫైనాన్స్ మెంబర్ ఆయన. డిసెంబర్ 1859 నుంచి ఆగస్టు 1860లో మరణించేంత వరకు ఆ పదవిలో కొనసాగారు. తొలి బడ్జెట్ సమర్పించినప్పుడు జీడీపీ రూ.2.7 లక్షల కోట్లు ఉండగా.. ఇప్పుడు దాదాపు రూ.150 లక్షల కోట్లకు చేరింది. ఇప్పటివరకు 74 వార్షిక బడ్జెట్లు, 14 మధ్యంతర బడ్జెట్లు, 4 ప్రత్యేక బడ్జెట్లను ప్రవేశ పెట్టారు. 70 రైల్వే బడ్జెట్లు వీటికి అదనం.

We’re now on WhatsApp. Click to Join.

1947 నాటికి బ్రిటిషర్లు 23 రైల్వే బడ్జెట్లు సమర్పించారు. అప్పట్లో అన్నింటికంటే రైల్వే ఆదాయం ఎక్కువ గనుక బ్రిటిషర్లు విడిగా రైల్వే బడ్జెట్‌ పెట్టేవారు. 1924 నుంచి 2016 వరకు అది అలాగే కొనసాగగా, 2017లో అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉండగా, ఆ విధానానికి స్వస్తి పలికి, దీనిని ప్రధాన బడ్జెట్‌లో విలీనం చేశారు. రైల్వేకు ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఏకైక దేశం మనదే కావటం విశేషం. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 76 ఏళ్లు. ఈ 76 ఏళ్లలో 162 బడ్జెట్లను ప్రవేశ పెట్టి అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన దేశంగా మన భారత్ రికార్డు లో నిలిచింది.

స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత మొదటి బడ్జెట్‌ను 26 నవంబర్ 1947న నాటి ఆర్థిక మంత్రి రామస్వామి షెట్టి కందస్వామి షణ్ముగం షెట్టి (ఆర్‌కే షణ్ముగం షెట్టి) (Minister RK Shanmukham Chetty) సమర్పించారు. గణతంత్ర భారత్‌లో తొలి బడ్జెట్ సమర్పించే ఛాన్స్ జాన్ మతాయ్‌కి దక్కింది. ఫిబ్రవరి 28, 1950న ఆయన లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ఈ బడ్జెట్ తయారీ ప్రక్రియలో భాగంగా ముందుగా అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వతంత్ర సంస్థలకు కేంద్ర ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేస్తుంది. ఈ ప్రక్రియ ఆగస్టు నెలలో ప్రారంభమవుతుంది. ఈ సర్క్యూలర్స్‌లో అవసరమైన మార్గదర్శకాలు ఉంటాయి. వీటి ద్వారానే అవసరాలు, డిమాండ్లను తెలిపేందుకు అవకాశం ఇస్తుంది కేంద్రం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అయ్యే ఆదాయ వ్యయాలు సహా గత సంవత్సరానికి సంబంధించిన వివరాలను మంత్రిత్వ శాఖలు అందిస్తాయి. ఉన్నతాధికారులు వాటిని పరిశీలించి మంత్రిత్వ శాఖలు, వ్యయాల విభాగంతో చర్చలు చేపడతారు.

Read Also : 1 Lakh Crores : లక్ష కోట్ల మోసానికి తెగబడిన ఒక్క మహిళ.. ఎవరు ?