Site icon HashtagU Telugu

E-Tipper: భారత్ లో తొలి ఈ–టిప్పర్.. ఒకసారి ఛార్జ్ చేస్తే 250 కి.మీ ప్రయాణం

India First E-Tipper

Ee Tipper

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) వినియోగం పెరుగుతోంది. ఇంధనం లేకుండా విద్యుత్ తో దూసుకెళ్లే ఈ– బైక్స్, కార్లు, బస్సులు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు (ఎంఈఐఎల్‌) చెందిన ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ భారత్‌లో తొలి ఎలక్ట్రిక్‌ ట్రక్‌ (E-Tipper) ను ఆవిష్కరించింది. బ్యాటరీని ఒకసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసేలా దీన్ని రూపొందించింది.

బెంగుళూరు వేదికగా జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌–2023లో ప్రదర్శనకు ఉంచిన ఈ వాహనం అందరి దృష్టిని ఆకర్షించింది. రెండు గంటల్లోనే బ్యాటరీ వంద శాతం చార్జ్ అవుతుంది. ఈ–ట్రక్‌ పనితీరు తెలుసుకోవడానికి కంపెనీ 2022 ఏప్రిల్‌లో ట్రయల్స్‌ ప్రారంభించింది. ట్రయల్స్ విజయవంతం కావడంతో ట్రక్ ను మార్కెట్ లోకి ప్రవేశ పెట్టేందుకు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సిద్ధం అవుతోంది. వచ్చే నెలలో ఈ ఎలక్ట్రిక్ టిప్పర్లు (E-Tipper) అందుబాటులోకి రానున్నాయి.

Also Read:  Google vs Chat GPT: గూగుల్‌కు తొలి షాక్..100 బిలియన్ డాలర్ల నష్టం..