దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో నిర్వహించిన రోజ్‌గార్ మేళాల ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీలలోని సర్కారీ విభాగాల కోసం ఎంపిక చేసిన 71,000 మందికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ లెటర్స్ (71000 Appointment Letters) అందజేశారు. ఈసందర్భంగా వారిని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తు ఫారమ్‌ల కోసం ఇంతకుముందు అభ్యర్థులు గంటల కొద్దీ క్యూలలో నిలబడాల్సి వచ్చేదని ప్రధాని మోడీ చెప్పారు. ఇప్పుడు జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తిగా ఆన్‌లైన్ చేసి ..అవసరమైన డాక్యుమెంట్స్ ను అభ్యర్థులు స్వీయ ధృవీకరణ చేసుకునేలా నిబంధనలు మార్చామని వివరించారు. గ్రూప్ సీ, డీ పోస్టులకు ఇంటర్వ్యూలను రద్దు చేశామని తెలిపారు. ఈ మార్పుల వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అవినీతికి, అభిమానానికి తావు లేకుండా చేశామన్నారు. కాగా, రోజ్‌గార్ మేళాల ద్వారా ఎంపికైన వారు గ్రామీణ డాక్ సేవక్స్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్ట్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ క్లర్క్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, లోయర్ డివిజన్ క్లర్క్, సబ్ డివిజనల్ ఆఫీసర్, టాక్స్ అసిస్టెంట్లు, ప్రిన్సిపాల్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి వివిధ పోస్టులలో(71000 Appointment Letters) చేరుతారు.
also read : Charge Man Jobs : ఛార్జ్‌మ్యాన్ అయ్యే ఛాన్స్.. 372 జాబ్స్
మోడీ మాట్లాడుతూ.. గత ఐదేళ్ళలో దేశంలో 4.50 కోట్ల మందికి సంఘటిత రంగ సంస్థల్లో జాబ్స్ వచ్చాయని ఈపీఎఫ్‌వో గణాంకాలతో తెలుస్తోందన్నారు. గత తొమ్మిదేళ్లలో మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ప్రభుత్వం మూలధన వ్యయంపై రూ.34 లక్షల కోట్లు వెచ్చించిందన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా రూ.10 లక్షల కోట్లు మూలధన వ్యయం కోసం కేటాయించామని చెప్పారు. దీనివల్ల లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని వెల్లడించారు.