Site icon HashtagU Telugu

Sengol In Parliament : కొత్త పార్లమెంట్ లో సెంగోల్ రాజదండం

Sengol From Parliament

Sengol From Parliament

మే 28న ప్రారంభం కాబోతున్న మన దేశ కొత్త పార్లమెంట్ భవనంలో ఒక చారిత్రక వస్తువు(Sengol In Parliament) కొలువు తీరబోతోంది.  అదే చారిత్రక రాజదండం ‘సెంగోల్’. బ్రిటీష్ వారి నుంచి భారతీయులకు అధికార మార్పిడికి గుర్తుగా..  ఈ రాజదండాన్ని బ్రిటీష్ ఇండియా  చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ , మన  దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు అందించారు. ‘సెంగోల్’ రాజదండాన్ని(Sengol In Parliament) గోల్డ్ తో తయారు చేశారు. కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్ సభ స్పీకర్ సీటు దగ్గర  దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర  మోడీ ప్రతిష్టించనున్నారు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్‌  మ్యూజియంలో ఇది ఉంది. తమిళ పదం “సెమ్మై” నుంచి “సెంగోల్” అనే పదం వచ్చింది. దీని అర్థం “ధర్మం”.

Also read : Wrestlers Protest: రెజ్లర్ల నిరసన.. మే 28న కొత్త పార్లమెంట్‌ భవనం వద్ద ‘మహిళా మహా పంచాయత్‌’..!

కొత్త పార్లమెంట్ భవనం దేశంలోని విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాదని..  ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ ఈనెల 28న  కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తుండటంపై అవి దండుకట్టాయి. రాజ్యాంగం ఇచ్చిన ప్రోటోకాల్ కు ప్రధాని మోడీ  తిలోదకాలు ఇస్తున్నారని ఆరోపిస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని (Opposition Boycott) నిర్ణయించాయి. ఈ మేరకు కాంగ్రెస్ సహా 19 పార్టీలు బుధవారం సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.