Cowin Data Leak : కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న వారి వ్యక్తిగత వివరాలు నిక్షిప్తమై ఉన్న కొవిన్ (CoWIN) ప్లాట్ ఫామ్ నుంచి ఇన్ఫర్మేషన్ లీకేజీ పై ఒక సంచలన విషయం బయటికి వచ్చింది. ప్రముఖ మీడియా సంస్ధ india today తాము సదరు హ్యాకర్ ను సంప్రదించామని ప్రకటించింది. ఓపెన్ సోర్స్ ఇన్వెస్టిగేషన్స్ (OSINT) టీమ్ ద్వారా ఆ హ్యాకర్ తో కాంటాక్ట్ అయ్యామని వెల్లడించింది. టీకాలు తీసుకున్న వారి వ్యక్తిగత వివరాలతో టెలిగ్రామ్ బాట్‌ను రూపొందించిన ఆ హ్యాకర్ తో మాట్లాడామని తెలిపింది.
Also read : Cyber Attack: 12 వేల భారత ప్రభుత్వ వెబ్‌సైట్లపై ఇండోనేషియా హ్యాకర్ల కన్ను.. కేంద్రం అప్రమత్తం
హ్యాకర్ ఏమన్నాడంటే ?
“నేను CoWIN ప్లాట్‌ఫామ్‌ను హ్యాక్ చేయలేదు.. దాని నుంచి నేరుగా సమాచారాన్ని దొంగిలించలేదు. వాస్తవానికి కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన పిల్లల ఆరోగ్య సమాచారంతో కూడిన ఒక వెబ్ సైట్ లో ఓపెన్ వల్నరబిలిటీ ఉండటాన్ని గుర్తించాను. ఆ పోర్టల్ ను ఉపయోగించి ఏఎన్ఎం కార్యకర్తల వివరాలను యాక్సెస్ చేశాను..ఆపై నేను కొందరు ఏఎన్ఎం కార్యకర్తల పేర్లు, ఫోన్ నంబర్ల ద్వారా లాగిన్ చేసి మరిన్ని వివరాలను సేకరించాను. ఈక్రమంలోనే కొందరి ఫోన్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసినప్పుడు.. కొవిన్ వెబ్ సైట్ లో నిక్షిప్తమై ఉన్న వారి వ్యక్తిగత వివరాలు వచ్చాయి. అంతేతప్ప CoWIN ప్లాట్‌ఫామ్‌లోని మొత్తం డేటాకు మేం యాక్సెస్(Cowin Data Leak) పొందలేకపోయాం. ఏఎన్ఎం కార్యకర్తల వివరాలతో కూడిన పోర్టల్ లోని లూప్ హోల్ వల్లే CoWIN ప్లాట్‌ఫామ్ లోని వివరాలు కూడా వచ్చేస్తున్నాయి” అని హ్యాకర్ చెప్పాడంటూ ఇండియా టుడే కథనాన్ని పబ్లిష్ చేసింది.