Site icon HashtagU Telugu

Get Fit In 3 Months Or Retire : పోలీసులు 3 నెలల్లో ఫిట్‌గా మారకుంటే వీఆర్ఎస్

Get Fit In 3 Months Or Retire

Get Fit In 3 Months Or Retire

అస్సాంలోని బీజేపీ సర్కారు ఫిజికల్ ఫిట్ నెస్ కోల్పోయిన పోలీసు సిబ్బంది, ఆఫీసర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఊబకాయంతో బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30+ కేటగిరీలో ఉన్నవాళ్ళు 3 నెలల్లోగా (ఆగస్టు 15 కల్లా) ఫిట్‌గా మారకుంటే.. వాలంటరీ రిటైర్మెంట్ (వీఆర్ఎస్) తీసుకునే ఛాన్స్ ఇస్తామని ప్రకటించింది. ఈమేరకు అస్సాం పోలీసు శాఖ సిబ్బందికి ఆదేశాలు(Get Fit In 3 Months Or Retire) జారీ చేసింది. ఆగస్టు 15 తర్వాత 15 రోజులపాటు పోలీసులందరి బీఎంఐ వివరాలను సేకరిస్తామని పేర్కొంటూ అస్సాం డీజీపీ జీపీ సింగ్‌ ట్వీట్‌ చేశారు. ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఆదేశాలకు అనుగుణంగా ఐపీఎస్‌ లు, అస్సాం పోలీస్‌ సర్వీస్‌ అధికారులతో సహా అన్ని విభాగాలకు చెందిన పోలీసుల బీఎంఐను నమోదు చేయాలని నిర్ణయించామన్నారు.

also read : Hyderabad : జిమ్ చేస్తూ కుప్ప‌కూలిన పోలీస్ కానిస్టేబుల్‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

70 వేల మంది..

” ఆగస్టు 15 కల్లా ఎవరైనా ఫిట్‌గా మారకపోతే.. థైరాయిడ్‌ సమస్య, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మినహాయింపు కల్పించి మిగతా వారికి వీఆర్ఎస్ ఇస్తాం. నేనే ఆగస్టు 16న మొదటగా బీఎంఐ లెక్కింపునకు హాజరవుతాను” అని డీజీపీ జీపీ సింగ్‌ వెల్లడించారు. అస్సాంలో దాదాపు 70 వేల మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. అయితే, విధులకు పనికిరాని సిబ్బందిని ఇంటికి పంపేందుకు (Get Fit In 3 Months Or Retire) పోలీసు విభాగం కార్యాచరణ ప్రారంభించింది. మద్యానికి బానిసలుగా మారిన, ఊబకాయంతో బాధపడుతున్న, విధులకు అనర్హులుగా తేలిన 680 మందికిపైగా సిబ్బందితో కూడిన ఓ జాబితాను ఇప్పటికే అస్సాం హోం శాఖ రూపొందించింది. పూర్తి స్థాయి సమీక్ష అనంతరం వారికి వీఆర్‌ఎస్‌ ఆప్షన్‌ ఇస్తామని తెలిపింది. ఈ క్రమంలోనే తాజాగా పోలీసులందరిని ఫిట్‌గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించింది.