Site icon HashtagU Telugu

G20 summit Budget : జీ20 కోసం కేంద్రం ఎంత ఖర్చు చేస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

G20 Summit Budget

G20 Summit Budget

యావత్ ప్రపంచ దేశాలు అన్ని కూడా ఇప్పుడు భారత్ (India) వైపే చూస్తున్నాయి. రేపు , ఎల్లుండి దేశ రాజధాని ఢిల్లీ లో G20 సమావేశాలు (G20 Summit) జరగబోతున్నాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా దాదాపు 30 దేశాల అగ్ర నేతలు, వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సమావేశాలను కేంద్రం (Central Government of India) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సమావేశాలను నిర్వ్హయించబోతుంది. న బూతో న భవిష్యత్ అనే తీరుగా ఏర్పాట్లు చేసింది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) సమావేశాలకు హాజరైన వారికీ శనివారం రాత్రి విందు ఇవ్వనున్నారు. దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు, వెండి పాత్రల్లో రుచికరమైన ఆహార పదార్థాలను వడ్డించడం కోసం ఏర్పాట్లు జరిగాయి. ఇదే కాదు ఈ సదస్సులో ఎన్నో ప్రత్యేకతలను ఏర్పాటు చేసారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు కేంద్రం భారీ ఎత్తున ఖర్చు చేస్తునట్లు తెలుస్తుంది. ఈ ఖర్చులకు సంబంధించి ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఎలాంటి గణాంకాలను తెలుపనప్పటికీ..ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు రూ.4100 కోట్ల వరకు ఖర్చు (G20 summit Budget) చేస్తున్నట్లు చెపుతున్నారు. ఇక 2008 నుండి నిర్వహించబడిన 18 సదస్సులలో 2023 సదస్సు అత్యుత్తమమైనదిగా పరిగణించబడుతుంది. దీంతో అమెరికా, ఇంగ్లండ్, కెనడా, మెక్సికో, రష్యా, ఆస్ట్రేలియాలకు అభివృద్ధి చెందుతున్న భారతదేశం ప్రపంచ నాయకుడిగా ఎదుగుతున్నట్లు చెప్పకనే చెప్పినట్లు అయ్యింది.

Read Also : Revanth Reddy: హోంగార్డు రవీందర్‌ది ఆత్మహత్య కాదు, కేసీఆర్ చేసిన హత్య: రేవంత్ రెడ్డి

ఇదిలా ఉంటె జీ20 దేశాల సమక్షంలో ఐశ్వర్యాన్ని ప్రదర్శించడం కోసం ప్రజాధనాన్ని విపరీతంగా ఖర్చు చేయడం అర్థరహితం, ఘోరం, సిగ్గుచేటు అని కొంతమంది నెటిజన్లు (Netizens) మండిపడుతున్నారు. భారత దేశంలో పేదరికం గురించి వారికి తెలిసిందే! పైపైన కనిపించే ఇలాంటి అహంకారపూరిత ప్రదర్శనలను నిరుత్సాహపరచాలన్నారు.

మరికొంతమంది మాత్రం ‘‘జనాభాలో 80 శాతం మంది ఉచిత రేషన్ సరుకులపై ఆధారపడే ప్రజలు ఉన్న దేశంలో, మురికివాడలు కనిపించకుండా ఆకుపచ్చని గుడ్డలతో కప్పివేస్తున్న దేశంలో, విదేశీ ప్రతినిధులు బంగారు పూత పూయబడిన పాత్రల్లో తింటారు. ప్రజాధనాన్ని సిగ్గులేకుండా ఖర్చు చేస్తున్నారు. 21వ శతాబ్దపు నీరోలు’’ అని దుయ్యబట్టారు. మొత్తం మీద కేంద్రం గొప్పలు..పేదోడి తిప్పలుగా మారింది.