Site icon HashtagU Telugu

Dog Saved : కుక్క విశ్వాసం అంటే ఇదే మరి..

Dogbite

dog saved owner from a crocodile

విశ్వాసానికి కుక్క (DOG) పెట్టింది పేరు. కుక్క ఎప్పుడూ మనిషికి ఒక నేస్తం లాంటిదే. కుక్కలు తమ యజమానులను ప్రేమిస్తాయి. మానవులు కూడా కుక్కలతో విడదీయరాని సంబంధం ఏర్పరుచుకుంటారు. కొంతమందైతే మనుషులతో కంటే కుక్కలతో ఎక్కువగా ఉంటారు. వారిపైనే ప్రేమను చూపిస్తూ ఉంటారు. అవి కూడా అంతే. తన యజమాని కోసం ఎంతటి త్యాగం అయినా కుక్క చేస్తుంది. కుక్క విశ్వాసానికి సంబంధించిన అనేక వార్తలను తరచుగా వెలుగులోకి వస్తుంటాయి. మనం వాటిని చదువుతూనే ఉంటాం.

తాజాగా ఓ కుక్క తన యజమానిని మొసలి నుంచి కాపాడి వార్తల్లో నిలిచింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ (Madhya Pradesh) లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ శివపురి నగరంలోని బంగంగా ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో మొసళ్లు తిరుగుతుంటాయి. ముఖ్యంగా రాత్రిపూట జనావాసాల మధ్యకు వస్తున్నాయి. గత కొద్దీ రోజులుగా మొసళ్ల బెడద ఎక్కువగా ఉందని..వాటికీ భయపడి బయటకు రావడమే మానేశామని , నిత్యం చుట్టుపక్కల పర్యవేక్షించల్సివస్తుందని వారంతా వాపోతున్నారు.

ఈ క్రమంలో ఓం ప్రకాష్ (Om Prakash) అనే వ్యక్తి ఎంతో కాలంగా ఓ కుక్కను పెంచుకుంటున్నారు. కాగా రాత్రి ఓ మొసలి (Crocodile) ప్రకాష్ ఇంటి ఆవరణలోకి వచ్చింది. దీనిని గమనించిన కుక్క పెద్దగా అరవడం స్టార్ట్ చేసింది. కుక్క అంతలా ఎందుకు అరుస్తుందని, ఒకవేళ ఎవరైనా దొంగ వచ్చాడా..అని ప్రకాష్ భావిస్తున్నాడు. మొసలి మరింత లోపలి వస్తుండడం తో కుక్క అరుస్తూ..ప్రకాష్ ను బయటకు తీసుకెళ్లింది. అక్కడ మొసలిని చూసి ప్రకాష్ కు భయం వేసింది. వెంటనే నేషనల్ పార్క్ రెస్క్యూ టీమ్‌కి సమాచారం అందించాడు. వారు ఎంతసేపటికి రాకపోయేసరికి స్థానికుల సాయంతో మొసలిని పట్టుకొని ఓ గోనె సంచిలో బంధించారు. నా పెంపుడు కుక్క లేకపోతే ఆ మొసలి హాని చేసి ఉండేదని ప్రకాష్ చెప్పుకొచ్చాడు.

Read Also: Viral Video: నీటిలో మునిగిన కుక్క పిల్లలను కాపాడిన ఏపీ పోలీసులు: తల్లి ప్రేమ