Site icon HashtagU Telugu

Rahul Twitter: తెరపైకి రాహుల్ ట్విట్టర్ నిషేధం

Rahul Twitter

New Web Story Copy (60)

Rahul Twitter: ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సే మోడీ సర్కార్ పై చేసిన ఆరోపణల తర్వాత కాంగ్రెస్ రంగంలోకి దిగింది. ఈ విషయంపై మోడీని ఇరుకున పెట్టె విధంగా ముందుకెళుతోంది. జాక్ డోర్సే ఆరోపణలపై కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ట్విటర్ మాజీ సీఈవో ప్రకటన మనందరికీ ఆందోళన కలిగిస్తోందని, దిగ్భ్రాంతికి గురిచేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. మోడీ సర్కార్ ట్విట్టర్ మాజీ సీఈవోపై ఒత్తిడి తెచ్చి ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశాయని ఆయన అన్నారు. అందుకే రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను నిషేధించారు. దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ ఇంకెక్కడ ఉందని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పారు వేణుగోపాల్.

జాక్ డోర్సే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రైతు ఉద్యమ సమయంలో భారతదేశం నుండి చాలా అభ్యర్థనలు వచ్చాయని, ముఖ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులు. రైతు సంఘాల ట్విట్టర్ ఖాతాలను తొలగించాలని ప్రభుత్వం నుండి డిమాండ్లు వచ్చాయని ఆరోపించారు. కానీ పక్షంలో ట్విట్టర్ లో పని చేసే ఉద్యోగుల ఇళ్లపై దాడి చేస్తామని జాక్ డోర్సేకి బెదిరింపులు వచ్చినట్లుగా తెలిపారు. అయితే ఈ ఆరోపణలపై భారత ప్రభుత్వం ఖండించింది. జాక్ డోర్సే ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పింది.

2021లో రాహుల్ గాంధీ ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అత్యాచారం, హత్య కేసులో తొమ్మిదేళ్ల బాలిక తల్లిదండ్రులను రాహుల్ గాంధీ కలిశారు. అనంతరం ఆ ఫొటోను రాహుల్ ట్విట్టర్‌లో పంచుకున్నాడు. ఈ విషయంలో ట్విట్టర్ తరపున చర్యలు తీసుకున్నారు.

Read More: CBN-Jagan : చంద్ర‌బాబుపై జ‌గ‌న్ మాన‌సిక దాడి