Site icon HashtagU Telugu

Kejriwal : అరవింద్‌ కేజ్రీవాల్‌ క‌స్ట‌డీ ఏప్రిల్ 23 వ‌ర‌కు పొడ‌గింపు

Arvind Kejriwal

CM Arvind Kejriwal judicial custody extended till April 23

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు ఊర‌ట ద‌క్క‌లేదు. ఎక్సైజ్ పాల‌సీకి చెందిన మ‌నీల్యాండ‌రింగ్ కేసు(money laundering case)లో ప్ర‌స్తుతం ఆయ‌న జుడిషియ‌ల్ క‌స్ట‌డీ(Judicial Custody)లో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఆ క‌స్ట‌డీని ఏప్రిల్ 23వ తేదీ వ‌ర‌కు పొడ‌గిస్తున్న‌ట్లు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు తెలిపింది. స్పెష‌ల్ జ‌డ్జి కావేరి బ‌వేజా ఈ కేసులో ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 23వ తేదీన కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా హాజ‌రుప‌రుచాల‌ని కోర్టు తెలిపింది. మ‌ద్యం విధానం కేసుతో లింకున్న మ‌నీల్యాండ‌రింగ్ కేసులో కేజ్రీవాల్ ప్ర‌ధాన సూత్ర‌ధారి అని ఈడీ ఆరోపిస్తున్న‌ది. ఈ కేసులో ఆయ‌న్ను మార్చి 21వ తేదీన అరెస్టు చేశారు. మ‌రోవైపు అర‌వింద్ కేజ్రీవాల్ పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేప‌ట్టింది. ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ ఏప్రిల్ 29వ తేదీన ఉంటుంద‌ని కోర్టు చెప్పింది జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, దీపాంక‌ర్ ద‌త్త‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసులో ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన కారణాలు, తదితర పరిణామాలపై వివరణ ఇవ్వాలంటూ ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 24 లోపు వివరణ ఇవ్వాలంటూ సుప్రీం ధర్మాసనం ఈడీని ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం పాలసీ కేసులో సత్వర ఉపశమనం కల్పించేందుకు నిరాకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కేసు విచారణను 29న విచారణ జరుపనున్నది. సుప్రీంకోర్టులో అరవింద్‌ కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.

Read Also: MLC Kavitha : ఎమ్మెల్సీ కవితపై జడ్జి సీరియస్

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని ఆరోపించారు. కేసు తదుపరి విచారణను వేగవంతం చేయాలని కోరారు. అయితే ఈ నెల 29లోపు విచారణ జరపలేమని కోర్టు తెలిపింది. ఈ నెల 19న విచారణకు జాబితా చేయాలని కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది కోరగా.. ధర్మాసనం ఇందుకు నిరాకరిస్తూ 29న విచారణకు జాబితా చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్‌ను విచారించనుంది.