Extinct Animal Of India: చీతాతో చాలిస్తే ఎలా.. బ్యాన్ టెంగ్ అడవి దున్నలనూ ఇండియాకు తీసుకొద్దాం!!

1948లో ఇండియాలో చీతాలు అంతరించాయి. ఎట్టకేలకు 74 ఏళ్ల తర్వాత వాటిని మళ్ళీ ఇండియాలోకి తీసుకొచ్చారు. దీంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

  • Written By:
  • Publish Date - September 20, 2022 / 09:14 AM IST

1948లో ఇండియాలో చీతాలు అంతరించాయి. ఎట్టకేలకు 74 ఏళ్ల తర్వాత వాటిని మళ్ళీ ఇండియాలోకి తీసుకొచ్చారు. దీంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

మన దేశంలోని అడవుల్లో అంతరించిపోయిన జంతువుల సంఖ్య ఇంకా చాలానే ఉంది. చీతాలతో పాటు ఇంకెన్నో వైల్డ్ యానిమల్స్ పూర్తిగా కనుమరుగు అయ్యాయి. అయితే వీటన్నింటినీ ఒకేసారి తీసుకు రావడం అసాధ్యం. అయితే తొలుత ఒక ప్రత్యేక అటవీ జంతువును తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే బ్యాన్ టెంగ్ అడవి దున్న. ఇవి చాలా స్పెషల్. ప్రస్తుతం మన దేశంలో ఒక్కటి కూడా లేదు. మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు వరకు ఇవి ఈశాన్య రాష్ట్రాల్లోని అడవుల్లో పెద్ద సంఖ్యలో ఉండేవి. అడవుల్లో ఉండే ఆదివాసీలు వీటిని మచ్చిక చేసుకుని వ్యవసాయ పనులకు కూడా వినియోగించుకునే వాళ్ళు . కాలక్రమంలో కొమ్ములు, చర్మం, మాంసం కోసం విపరీతంగా వేటాడటంతో ఇవి అంతరించిపోయాయి. వీటి మాంసం మెత్తగా, రుచిగా ఉంటుంది. అందువల్ల మాంసం కోసం అప్పట్లో బ్యాన్ టెంగ్ అడవి దున్నల వేట జరిగింది. వీటి కొమ్ములకు అంతర్జాతీయ మార్కెట్ లో భారీ రేటు ఉంది. కొమ్ముల కోసం కూడా బ్యాన్ టెంగ్ లను స్మగ్లర్లు వెంటాడి ఖతం చేశారు.

ప్రస్తుతం బ్యాన్ టెంగ్ అడవి దున్నలు మలేషియా, ఇండోనేషియా, కాంబోడియా, థాయ్ ల్యాండ్ దేశాల్లో ఉన్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5వేల నుంచి 8వేల బ్యాన్ టెంగ్ దున్నలే మిగిలి ఉన్నాయి. దీంతో వీటిని అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఐసీయూఎన్ చేర్చింది. ఈనేపథ్యంలో ప్రస్తుతం అవి అందుబాటులో ఉన్న దేశాల నుంచి మన దేశానికి తెప్పించుకోవచ్చు. ఇందుకయ్యే ఖర్చు కూడా తక్కువే ఉంటుంది. వాటిని తెప్పించి మన దేశంలో బ్రీడింగ్ చేసి సంతానోత్పత్తి చేయించవచ్చు.

ప్రపంచంలో క్లోనింగ్ జరిగిన రెండో జంతువు బ్యాన్ టెంగ్ అడవి దున్నే. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు దీన్ని క్లోనింగ్ చేశారు. చనిపోయిన మగ బ్యాన్ టెంగ్ చర్మం నుంచి సేకరించిన కణాలను.. బతికి ఉన్న ఆడ బ్యాన్ టెంగ్ అండంతో ల్యాబ్ లో సమ్మేళనం చేయించారు. ఈ రెండింటి కలయిక వల్ల కొంత గ్యాప్ తో రెండు బ్యాన్ టెంగ్ దూడలు జన్మించాయి. మొదట పుట్టింది 7 సంవత్సరాలు బతికింది. రెండో సారి పుట్టిన దాన్ని రోజులకే శాస్త్రవేత్తలు చంపేశారు. ఎందుకంటే అది ఓవర్ గ్రోత్ డిజార్డర్ ను ఎదుర్కొంది.