Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు(Gyanvapi Mosque) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఆ మసీదు ప్రాంగణంలో పూజలు నిర్వహించుకునే హక్కును కోరుతూ వారణాసి కోర్టులో ఐదుగురు హిందూ మహిళలు వేసిన దావాను సవాల్ చేస్తూ ముస్లిం పక్షం వేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు బుధవారం కొట్టివేసింది.

  • Written By:
  • Updated On - May 31, 2023 / 06:12 PM IST

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు(Gyanvapi Mosque) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఆ మసీదు ప్రాంగణంలో పూజలు నిర్వహించుకునే హక్కును కోరుతూ వారణాసి కోర్టులో ఐదుగురు హిందూ మహిళలు వేసిన దావాను సవాల్ చేస్తూ ముస్లిం పక్షం వేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శృంగార గౌరీ సహా పలువురు దేవతామూర్తులకు నిత్యం పూజించేందుకు అనుమతి ఇవ్వాలని ఐదుగురు హిందూ మహిళలు గతంలో వారణాసి కోర్టులో పిటిషన్ వేశారు.

Also read : RSS: ముస్లిం మతపెద్దలతో సమావేశం కోసం మసీదుకు వెళ్లిన ఆర్ఎస్ఎస్ చీఫ్..!!

ఈ వ్యాజ్యంపై అభ్యంతరాలతో అప్పట్లో  జ్ఞానవాపి మసీదును(Gyanvapi Mosque) నిర్వహించే అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ (ఏఐఎంసీ) వేసిన పిటిషన్ ను 2022 సెప్టెంబర్ 12న వారణాసి కోర్టు తిరస్కరించింది. దీంతో  వారణాసి కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ మసీదు కమిటీ 2022 అక్టోబరులో అలహాబాద్ హైకోర్టు లో  సివిల్ రివిజన్ పిటిషన్‌ వేసింది. దానిపై బుధవారం ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్ జేజే మునీర్ ధర్మాసనం.. మసీదు కమిటీ పిటిషన్ ను కొట్టివేసింది. ఆ మసీదు ప్రాంగణంలో పూజలు చేసే అనుమతులు కోరుతూ ఐదుగురు హిందూ మహిళలు వేసిన పిటిషన్ చెల్లుతుందని పేర్కొంది.