Site icon HashtagU Telugu

CBSE Results: సీబీఎస్ఈ విద్యార్థుల‌కు అల‌ర్ట్.. రిజ‌ల్ట్స్ అప్పుడే..?

CBSE Guidelines

CBSE Guidelines

CBSE Results: సీబీఎస్ఈ బోర్డు నుండి 10 లేదా 12వ త‌ర‌గ‌తి పరీక్షలు రాసిన అభ్య‌ర్థుల‌కు బోర్డు కీల‌క స‌మాచారాన్ని ప్ర‌క‌టించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12, 10వ బోర్డ్ ఫలితాల (CBSE Results)ను మే 20 తర్వాత విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సంవత్సరం సీబీఎస్ఈ బోర్డు ప‌రీక్ష‌ల‌కు సుమారు 39 లక్షల మంది విద్యార్థులు 10, 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది 10వ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 మధ్య జరగగా, 12వ త‌ర‌గ‌తి పరీక్ష ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 మధ్య జరిగింది. అయితే విద్యార్థులు తమ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది మే 12న సీబీఎస్ఈ బోర్డు ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు విడుదలయ్యాక విద్యార్థులు తమ ఫలితాలను CBSE అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.inలో చూసుకోవచ్చు.

అయితే ఇటీవ‌ల సీబీఎస్ఈ ఫ‌లితాలు విడుద‌లైన‌ట్లు కొన్ని ఫేక్ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. అయితే బోర్డు అధికారులు రిజ‌ల్ట్స్‌పై ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేద‌ని, సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన వార్త‌లు ఫేక్ అని తేల్చేశారు. అంతేకాకుండా రిజల్ట్స్‌పై ఫేక్ వార్త‌లు స‌ర్క్యూలేట్ చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు.

Also Read: Tollywood : ఇండస్ట్రీ లో ఛాన్సులు రావాలంటే దర్శక – నిర్మాతల కోరిక తీర్చాల్సిందే – రమ్యకృష్ణ

మీరు CBSE ఫలితాలు 2024ని ఎలా చెక్ చేసుకోవ‌చ్చు..?

CBSE బోర్డ్ ద్వారా ఫలితాలను విడుదల చేసిన తర్వాత విద్యార్థులు ఈ కింది దశలను అనుసరించడం ద్వారా వారి ఫలితాలను తనిఖీ చేయగలరు.

– ముందుగా CBSE అధికారిక వెబ్ సైట్ cbseresults.nic.in లేదా results.cbse.nic.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
– ఇప్పుడు సీబీఎస్ఈ 10 ఫలితం 2024 లేదా సీబీఎస్ఈ 12వ ఫలితం 2024పై క్లిక్ చేయండి.
– అక్క‌డ‌ మీ రోల్ నంబర్, పుట్టిన తేదీని స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.
– ఇప్పుడు సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ స్క్రీన్‌పై మీ ఫలితాన్ని చూస్తారు.
– దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని క‌ల‌ర్ ప్రింట్ తీసుకోండి.

We’re now on WhatsApp : Click to Join