Ugadi Pachadi: ఉగాది పచ్చడి విశిష్టత గురించి మీకు తెలుసా..?

హిందువులు నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఉగాది పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఉగాది అనగానే ప్రకృతిలో పచ్చని చెట్లు దర్శనం ఇస్తాయి. చైత్రమాసం ప్రారంభమైన రోజున ఉగాది జరుపుకుంటారు.

  • Written By:
  • Publish Date - April 8, 2024 / 07:35 PM IST

హిందువులు నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఉగాది పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఉగాది అనగానే ప్రకృతిలో పచ్చని చెట్లు దర్శనం ఇస్తాయి. చైత్రమాసం ప్రారంభమైన రోజున ఉగాది జరుపుకుంటారు. ఈ ఏడాది ఉగాది ఏప్రిల్ 9 మంగళవారం రోజున వచ్చింది. అయితే.. మనసులో కొత్తదనంతో పాటు ఇల్లు కొత్తగా కనిపించేందుకు గుమ్మానికి పూలు, గుమ్మానికి రంగోలి పెట్టి దేవుడికి నైవేద్యంగా పచ్చడి సమర్పించే సంప్రదాయ పండుగ ఉగాది. ఉగాదిని మహారాష్ట్ర, కర్నాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పండుగ ఉత్సాహంతో జరుపుకుంటారు. దీనిని ఆంధ్ర మరియు కర్ణాటకలలో ఉగాది అని పిలుస్తుండగా, మహారాష్ట్రలో దీనిని “గుడిపడవ” అని పిలుస్తారు. అయితే.. ఈ వేసవిలో వచ్చే ఉగాది పండుగ సందర్భంగా చేసే ఉగాది పచ్చడి విశిష్టత గురించి మనలో చాలా తక్కువ మందికి తెలుసు.. అంతేకాకుండా.. ఉగాది పచ్చడిలో దాగున్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి కూడా చాలా తక్కువగానే తెలుసు.. మనం ఉగాది పచ్చడిలో దాగిఉన్న ఆరోగ్య ప్రజయోజనాలు తెలుసుకుందాం…

ఉగాది పండుగ సందర్భంగా చేసే వంటలలో ఉగాది పచ్చడి ప్రత్యేకమైనది. ఉగాది రోజున దేవుడికి నైవేద్యంగా సమర్పించేందుకు తయారు చేసే వంటలలో ఉగాది పచ్చడి ముఖ్యమైనది.. అయితే… ఉగాది పచ్చడిని చింతపండు, పచ్చి మామిడికాయ, బెల్లం, వేప పువ్వుతో పాటు కారం, ఉప్పు, పండ్లు మొదలైనవి వేసి తయారు చేస్తారు. ఇది జీవితంలోని 6 భావోద్వేగాలను సూచిస్తుంది. ఈ వంటకం యొక్క ప్రాథమిక పదార్థాలు, ఉగాది పచ్చడి వేప, బెల్లం, చింతపండు, మామిడి.. ఈ పదార్థాలన్నీ ఆరోగ్య ప్రయోజనాలకు దోహదం చేస్తాయి. ఉగాది పచ్చడి తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలసిన షడ్రుచుల సమ్మేళనం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ పచ్చడి ఇస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

వేప: వేప చెట్టులోని పూలు, కాండం బెరడు, ఆకులు వంటి అన్ని భాగాలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వివిధ చర్మ వ్యాధులు, మలేరియా, వైరల్ జ్వరం మరియు మధుమేహం చికిత్సలో వేప సహాయపడుతుంది. పేగులోని పరాన్నజీవులను కూడా వేప చంపుతుంది. చింతపండు మరియు పచ్చి మామిడితో వేపను సేవిస్తే, అది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధం చేస్తుంది.

పచ్చి మామిడి: ఇది ఎసిడిటీ మరియు ఛాతీ మంట నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది పిత్త స్రావాన్ని పెంచుతుంది మరియు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి ప్రేగులను శుభ్రపరుస్తుంది. ఇది రక్త నాళాల స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది మరియు కొత్త రక్త నాళాలు ఏర్పడటానికి సహాయపడుతుంది.

బెల్లం: ఇది శరీరంలోని హానికరమైన టాక్సిన్‌లను బయటకు పంపడం ద్వారా కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ సెలీనియం మరియు జింక్‌తో లోడ్ చేయబడింది, ఇది ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్‌ను నివారిస్తుంది మరియు ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

చింతపండు: ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది, కడుపులో అసౌకర్యం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది శరీరం అంతటా మంటను తగ్గిస్తుంది, చర్మ పరిస్థితిని మెరుగుపరుస్తుంది మరియు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

ఉగాది పచ్చడి తయారు చేసే విధానం :

ముందుగా కొత్త కుండలో కొద్దిగా నీళ్లు పోసి కొత్త చింతపండును నానబెట్టుకోవాలి. అలా నానబెట్టిన 10 నిమిషాల తరువాత చింతపండును గుజ్జును వేరు చేయాలి. ఇప్పుడు కాడల నుంచి వేరు చేసిన వేపపువ్వులను చింతపండు నీటిలో కలపాలి. వీటితో పాటు సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలను, కొబ్బరి ముక్కలను సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవే కాకుండా.. బెల్లం తురుము కూడా ఈ పచ్చడిలో కలుపుకోవాలి. ఆ తర్వాత మిగతా పళ్లను వాటిని కూడా సన్నగా తరిగి పచ్చడిలో వేసుకోవాలి. మిరపకాయ ముక్కలను వేసి చివరిగా ఒక అర స్పూను ఉప్పు వేసి కలుపుకోవాలి. అంతే షడ్రుచుల ఉగాది పచ్చడి తయారైనట్లే.. ఇక వసంత లక్ష్మీని ఆహ్వానించి, నైవేద్యంగా సమర్పించి, తర్వాత ఇంటిల్లిపాది స్వీకరించాలి.
Read Also : Samsung : శాంసంగ్ ఎమ్ సిరీస్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. ఫీచర్స్‌.. అదుర్స్‌..!