Site icon HashtagU Telugu

Ladies Dressing : ఆడవారు ఏ రకమైన దుస్తులు ధరిస్తే మగవారు ఎక్కువ ఇష్టపడతారో మీకు తెలుసా?

Women Dressing Secrets for Impressing Men

Women Dressing Secrets for Impressing Men

మగవారు ఆడవారు(Ladies) చీరలో(Saree) ఉంటే ఎక్కువగా ఇష్టపడతారు. చీర కట్టుకోవడం వలన చిన్న పిల్లలా కనపడే వారు కూడా స్త్రీగా కనబడతారు. మన దేశ సంప్రదాయకరమైన దుస్తులు చీరలు. ఇవి మన దేశాన్ని ప్రతిబింబిస్తాయి. చీర కట్టుకుంటే అమ్మాయిలు ఎంతో నిండుగా ఉంటారు. చీర అనేది పొట్టిగా ఉన్న లేదా పొడుగ్గా ఉన్న లేదా సన్నగా ఉన్న లేదా లావుగా ఉన్న ఎలా ఉన్న ఆడవారికైనా ఎంతో మంచిగా నప్పుతుంది. చీరలో వారు ఎంతో ఆకర్షణీయంగా కనబడతారు.

ఇప్పుడు చీరల్లో ఎన్నో రకాల మోడల్స్, ఫ్యాబ్రిక్స్ డిజైన్స్ వచ్చాయి. ఇంకా చీరలను రకరకాల మోడల్స్ లో తయారుచేస్తున్నారు. చీరలను కట్టుకునేటప్పుడు ఎన్నో విధాలుగా కట్టుకోవచ్చు. ఎప్పుడూ ఒకే రకంగా కట్టుకోకూడదు. వేరే విధంగా కట్టుకుంటూ ఉంటే ఇంకా ఎంతో అందంగా కనబడతారు. ఎవరైనా మగవారు తమ గర్ల్ ఫ్రెండ్స్ ని చీరలో చూడాలని ఎంతో ఆశపడతారు. ఆడవారు కూడా ఏ విధమైన దుస్తులు వేసుకున్నా చీరలోనే ఎక్కువ అందంగా కనబడతారు.

చీర కట్టులో ఆడవారి శరీరాకృతి కూడా బాగుంటుంది. ఏ ఆడపిల్లనైనా చీరలో చూస్తే మగవారు తొందరగా ఇష్టపడతారు. అందరు మగవారు చీరలనే ఇష్టపడతారని చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఫ్యాషన్ కి అలవాటు పడి మోడరన్ దుస్తులు వేసుకునే ఆడవారిని కూడా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అందరికీ ఒకే రకమైన ఆలోచన ఉండదు కదా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆలోచన. కానీ ఏది ఏమైనా చీరకట్టులో వచ్చే అందం ఆడవారికి ఇంకా ఏ దుస్తులలోను ఉండదు. అందుకే ఎన్నో సినిమాల్లో కూడా హీరోయిన్ ని హీరో చీరలో చూస్తే అలా చూస్తూ ఉండిపోతాడు. కొంతమంది భారతీయ మగవారిపై చేసిన రీసెర్చ్ లో కూడా చాలా మంది తమ భార్యలను, గర్ల్ ఫ్రెండ్స్ ని చీరలోనే చూడటానికి ఇష్టపడతారని తెలిపారు. అలాగే అబ్బాయిలని ఇంప్రెస్ చేయాలంటే అమ్మాయిలు చీరలో కనపడితే ఈజీగా ఇంప్రెస్ అవుతారట.

 

Also Read : Bhagini Hastha Bhojanam : భగినీ హస్త భోజనం అంటే ఏంటి ? అన్నదమ్ములకు ఎందుకు భోజనం పెట్టాలి ?