Site icon HashtagU Telugu

Madhapur Drugs case : డ్రగ్స్ కేసుతో సంబంధం లేదంటున్న హీరో నవదీప్

Madhapur Drags Case Navadeep

Madhapur Drags Case Navadeep

మరోసారి డ్రగ్స్ కేసు (Tollywood Drugs Case)లో హీరో నవదీప్ (Navadeep) పేరు బయటకు వచ్చింది. గతంలో కూడా నవదీప్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినా సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆయన పేరు బయటకు రావడం తో పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిత్రసీమ నిత్యం డ్రగ్స్ వ్యవహారం తో వార్తల్లో నిలుస్తూనే ఉంటుందనే విషయం చెప్పాల్సిన పనిలేదు.

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు (Tollywood Drugs Case) ఎంత సంచలనం రేపిందో తెలియంది కాదు. ఈ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో పాటు హీరో రవితేజ, నవదీప్, ఛార్మి , ముమైత్ , పలువురు డైరెక్టర్స్ , ఆర్టిస్టులు , కెమెరామెన్లు అబ్బో చాలామంది పేర్లు బయటకు రావడం..వారిని ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు మరోసారి టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో వార్తల్లో నిలుస్తుంది. రీసెంట్ గా తెలంగాణ సర్కార్ డ్రగ్స్ , గంజాయి వంటి వాటిపై ప్రత్యేక ఫోకస్ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ పేర్లు వినిపించవద్దని..దీనిపై ఎక్కడ తగ్గొద్దని..ఎంతపెద్ద వారైనా..సరే తగ్గొద్దంటూ పోలీసులకు కీలక ఆదేశాలు జారీచేశారు. దీంతో పోలీసులు పబ్స్, పలు సెంటర్లపై ఫై ప్రత్యేక నిఘా పెట్టారు.

Read Also : Lokesh Delhi Tour : ఢిల్లీ బ‌య‌ల్దేరిన నారా లోకేష్‌.. ఏపీ పరిస్థితుల‌పై జాతీయ మీడియాకు ప్ర‌జెంటేష‌న్‌

ఈ క్రమంలో మాదాపూర్ లో దొరికిన డ్రగ్స్ లో హీరో నవదీప్‌కు సంబంధం ఉందని పోలీసులు తేల్చారు. మాదాపూర్ డ్రగ్స్ కేసు (Madhapur Drugs case) తో హీరో నవదీప్‌కు సంబంధం ఉందని. డ్రగ్స్ డీలర్స్‌తో ఆయనకు లింకులు ఉన్నాయని స్పష్టం చేసారు. ప్రస్తుతం నవదీప్ పరారీలో ఉన్నాడని, ఆయన కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే నవదీప్ మేనేజర్ ను, దేవరకొండ సురేష్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

ఇదిలా ఉంటె ఈ డ్రగ్స్ వ్యవహారం ఫై నవదీప్ స్పందించారు. తాను కుటుంబంతో సహా పారిపోయినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశాడు. తాను ఎక్కడికీ పారిపోలేదని, హైదరాబాదులోనే ఉన్నానని క్లారిటీ ఇచ్చాడు. ఈ డ్రగ్స్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని వెల్లడించాడు. ఒకవేళ పోలీసులు వేరే నవదీప్ గురించి ప్రెస్ మీట్లో చెప్పారేమో అని హీరో నవదీప్ వ్యాఖ్యానించాడు. మరి నవదీప్ చెప్పిందాంట్లో నిజం ఉందా..? లేదా అనేది పోలీసులే మరోసారి క్లారిటీ ఇవ్వాలి.