Site icon HashtagU Telugu

Salman Khan Business : సల్లూ భాయ్ న్యూ బిజినెస్.. ఏమిటది?

Salman Khan Business

Salman Khan Business

సల్మాన్ ఖాన్ కొత్త బిజినెస్ ను (Salman Khan Business) స్టార్ట్ చేయబోతున్నాడు తెలుసా ? ఇంతకీ ఏమిటా బిజినెస్ ? సల్లూ భాయ్ ను అంతగా అట్రాక్ట్ చేసిన ఆ బిజినెస్ ఐడియా ఏమిటి ? అనేది అందరికీ ఎంతో ఇంట్రెస్టింగ్ !!  ముంబై బాంద్రాలోని  కార్టర్ రోడ్‌లో సముద్రానికి ఎదురుగా సల్లూ భాయ్ విలాసవంతమైన హోటల్‌ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం ఆయన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నారట. అయితే తొలుత ఈ ప్లేస్ లో రెసిడెన్షియల్ సొసైటీని నిర్మించాలని సల్మాన్ అనుకున్నారట. కానీ తర్వాత ప్లాన్ మార్చుకొని.. లగ్జరీ  హోటల్‌ (Salman Khan Business) అయితే బెస్ట్ అని ఆయన డిసైడ్ అయ్యారట. ఈ స్థలాన్ని రెసిడెన్షియల్‌ సొసైటీ స్టార్‌లెట్‌ సీహెచ్‌ఎస్‌ నుంచి సల్మాన్ ఖాన్ తన తల్లి సల్మా ఖాన్ పేరు మీద కొన్నాడు.

also read : Salman Farmhouse: భూతల స్వర్గం సల్మాన్ ఖాన్ ‘ఫామ్ హౌస్’.. ప్రత్యేకతలివే!

ఇక సల్లూ కట్టబోయే లగ్జరీ  హోటల్‌ 19 అంతస్తుల్లో ఉంటుందట. భవనం మొదటి అంతస్తులో కేఫ్, రెండో అంతస్తులో రెస్టారెంట్, మూడో అంతస్తులో జిమ్‌, స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. నాలుగో అంతస్తు సర్వీస్‌ ఫ్లోర్‌గా ఉంటుంది. 5, 6 అంతస్తులలో కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తారు. ఏడో అంతస్తు నుంచి 19వ అంతస్తు వరకు హోటల్ ఉంటుంది. హోటల్ నుంచి సముద్రం ప్రత్యేకంగా వీక్షించే సౌకర్యం ఉంటుంది.