Site icon HashtagU Telugu

Ranbir Kapoor : రణ్‌బీర్ రామాయణం కోసం.. సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ మ్యూజిక్ డైరెక్టర్..

Ar Rahman Hans Zimmer Is Selected For Ranbir Kapoor Ramayana Movie

Ar Rahman Hans Zimmer Is Selected For Ranbir Kapoor Ramayana Movie

Ranbir Kapoor : రామాయణం ఎంతమంది సినిమా రూపంలో తీసుకువచ్చినా చూడాలనే అనిపిస్తుంది. తాజాగా బాలీవుడ్ దర్శకుడు నితేశ్‌ తివారీ రణ్‌బీర్ కపూర్ ని రాముడిగా చూపిస్తూ మరో రామాయణ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని జరుపుతున్నారు. ప్రతి సీన్ ని ప్రీ విజువలైజేషన్ చేసుకొని మూవీని పక్కాగా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట.

కాగా ఏ సినిమాకైనా మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటిది రామాయణం లాంటి గొప్ప కథ చెబుతున్నప్పుడు.. ఆ కథకి తగ్గ గ్రాండ్ మ్యూజిక్ ని సమకూర్చాలి. అందుకోసమే మేకర్స్.. ఇద్దరు ఆస్కార్ విన్నర్స్ ని రంగంలోకి తీసుకు వస్తున్నారట. ఇండియన్ ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ ని ఈ సినిమాకి సంగీతం చేయడం కోసం ఎంపిక చేసుకున్న మేకర్స్.. అలాగే హాలీవుడ్ నుంచి మరో ఆస్కార్ విన్నర్ ని కూడా ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకు వస్తున్నారు.

మ్యాన్ ఆఫ్ స్టీల్ (సూపర్ మ్యాన్), ది డార్క్ నైట్ ట్రయాలజీ (బ్యాట్ మ్యాన్), పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్, నో టైమ్ టు డై, మిషన్ ఇంపాజిబుల్, గ్లాడియేటర్, ఇన్‌సెప్షన్, ఇంటర్‌స్టెల్లార్.. వంటి హాలీవుడ్ టాప్ సినిమాలకు మ్యూజిక్ అందించిన హన్స్ జిమ్మెర్ (Hans Zimmer).. రణ్‌బీర్ కపూర్ రామాయణానికి సంగీతం అందించడం కోసం రెహమాన్ తో చేతులు కలుపుతున్నారట. మరి ఈ ఆస్కార్ ద్వయం రామాయణాన్ని ఎంత గొప్ప వినిపించగలదో వెండితెరపై చూడాల్సిందే.

ఈ సినిమాని శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17న పూజాకార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారట. ఇక రెగ్యులర్ షూటింగ్ ని జూన్ లేదా జులైలో మొదలు పెట్టనున్నారట. ఈ సినిమా తెలుగు వెర్షన్ కి త్రివిక్రమ్ డైలాగ్స్ రాయబోతున్నారు. రణ్‌బీర్ రాముడిగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి సీతగా, రావణాసురుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్‌ ప్రీత్‌ నటించబోతున్నట్లు సమాచారం.

Also read : Amala Paul : అమలాపాల్ సీమంతం వేడుక ఫోటోలు చూశారా..!