Site icon HashtagU Telugu

Amala Paul : అమలాపాల్ సీమంతం వేడుక ఫోటోలు చూశారా..!

Amala Paul Shares Her Baby Shower Celebration Photos Gone Viral

Amala Paul Shares Her Baby Shower Celebration Photos Gone Viral

Amala Paul : తమిళ్ యాక్ట్రెస్ అమలాపాల్ ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే ప్రెగ్నెంట్ అంటూ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. కాగా మరికొన్ని రోజుల్లో అమల పాల్ పండంటి బేబీకి జన్మనివ్వబోతున్నారు. తాజాగా ఈమె సీమంతం వేడుకని జరుపుకున్నారు. సూరత్ లోని తన భర్త జగత్ దేశాయ్ ఇంటిలో అమలాపాల్ తన సీమంతం వేడుకలను జరుపుకున్నారు.

హిందూ సాంప్రదాయ పద్ధతిలో కుటుంబసభ్యులు మరియు సన్నిహితులు మధ్య అమలాపాల్ తన సీమంతం వేడుకని జరుపుకున్నారు. ఇక ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను అమలాపాల్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు. ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఫోటోలు చూసిన నెటిజెన్స్.. అమలాపాల్ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also read : Pushpa 2: యశ్ రికార్డ్ ని బన్నీ బద్దలు కొట్టనున్నాడా.. పై చేయి మాత్రం ఆ హీరోదే!

కాగా వీరిద్దరికి కవల పిల్లలు పుడుతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. మరి ఆ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కాగా 2014 లో డైరెక్టర్ విజయ్‌ ని అమలాపాల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో 2017 లో విడాకులతో విడిపోయారు. ఆ తరువాత సింగర్ భవీందర్ సింగ్‌తో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు ఇద్దరు పెళ్లి డ్రెస్సులో ఉన్న ఓ ఫోటో కూడా బయటకి వచ్చింది. కానీ అది షూట్ అంటూ చెప్పుకొచ్చారు అమలాపాల్.

ఇక 2023లో జగత్ దేశాయ్ ని ప్రియుడిగా ప్రకటించి, అతని ప్రేమకి అంగీకారం చెబుతున్న అంటూ వెల్లడించి, వెంటనే ఏడడుగులు వేసేసారు. ఆ తరువాత రెండు నెలలకే ప్రెగ్నెన్సీ ప్రకటించి.. ఇప్పుడు అమ్మ అని పిలిపించుకోవడం కోసం రెడీ అవుతున్నారు.