Site icon HashtagU Telugu

Kangana Ranaut : రోజా ఎవరో నాకు తెలియదని షాక్ ఇచ్చిన కంగనా..

i don't know who is roja

i don't know who is roja

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut)..ఏపీ మంత్రి రోజా (AP Minister Roja) అంటే ఎవరో నాకు తెలియదని చెప్పి షాక్ ఇచ్చింది. బాలీవుడ్ లో వివాదాస్పద నటిగా కంగనాకు పేరుంది. సినిమాల కన్నా..అమ్మడు వివాదస్పద వ్యాఖ్యలు లతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా బిజెపి సర్కార్ ఫై ఈమె నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి..పలుమార్లు వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈమె చంద్రముఖి 2 (Chandramukhi 2)మూవీ లో నటిస్తుంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajanikanth) నయనతార (Nayanatara)జంటగా నటించిన చంద్రముఖి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టించింది ఈ సినిమా. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వస్తే అస్సలు మిస్ కాకుండా చూస్తూ ఉంటారు జనాలు. అలాంటి ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. మొదటి సినిమాకి దర్శకత్వం వహించిన పి వాసు (P Vasu) ఇప్పుడు పార్ట్ 2 కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇందులో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో పోషిస్తుండగా..చంద్రముఖి పాత్రను కంగనా పోషిస్తుంది. ఈ నెల 15 న తెలుగు, తమిళ్ తో పాటు పలు భాషల్లో సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడ్ చేసారు.

Read Also : Rain Alert Today : ఇవాళ, రేపు ఆ జిల్లాల్లో కుండపోతే.. అలర్ట్ లు జారీ

ప్రమోషన్ లో భాగంగా చిత్రయూనిట్ చెన్నైలో మంగళవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కంగానా రనౌత్ (Kangana Ranaut) మాట్లాడుతూ… రాజకీయాల్లో అవకాశం వస్తే వదులుకోనని అన్నారు. తాను దేశభక్తురాలినని, అందుకే తనవంతుగా పేదలకు తోచిన సాయం చేస్తున్నానని తెలిపారు. రాజకీయాల్లోకి వస్తే సినిమాలు వదులుకోవాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఏపీ పర్యాటక శాఖ మంత్రి, నటి రోజా చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా…”రోజా అంటే ఎవరు? అలాంటి వారు ఉన్నారన్న విషయమే నాకు తెలియదు. ఆమె గురించి నేనేం మాట్లాడతాను? ” అని కంగనా తెలిపి షాక్ ఇచ్చింది.