ప్రఖ్యాత గాయని హేమలత జీవిత చరిత్రను ‘దస్తాన్-ఈ-హేమలత’ (Dastan-e-Hemlata) పేరుతో ప్రముఖ జర్నలిస్ట్ డాక్టర్ అర్వింద్ యాదవ్ (Dr. Arvind Yadav) రచించారు. శనివారం న్యూఢిల్లీలోని సాహిత్య ఆజ్ తక్ వేదికపై ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో హేమలత గారి జీవితంలోని అనేక ఘట్టాలను , కీలక అంశాలను పొందుపరిచారు. హేమలత తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో లతా భట్‌గా మార్వాడీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆ తరువాత కలకత్తాలో తన బాల్యాన్ని గడిపింది.
రవీంద్ర జైన్‌తో కలిసి హేమలత అనేక పాటలకు ప్లే బ్యాక్ సింగర్ గా పనిచేసింది. వాటిలో “అంఖియోం కే ఝరోఖోన్ సే”, బినాకా గీత్ మాలా అనే ఆల్బమ్ లు అమ్మకాల్లో సరికొత్త రికార్డులను నమోదు చేసాయి. 1978లో నంబర్ వన్ పాటగా నిలిచింది. ఈ పాట కోసం హేమలత ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు కూడా ఎంపికైంది. ఇప్పటికీ ఈ పాటకు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. మాతాజీ నిర్మలా దేవికి అంకితం చేసిన జైన్ క్యాసెట్ ఆల్బమ్ సహజ్ ధార (1991)లో హేమలత పాడింది. జులై 1992లో బ్రస్సెల్స్, బెల్జియంలో జరిగిన రెండు కచేరీలలో కూడా ఈ ఆల్బమ్ పాటలు ఆమె పాడింది. 1990వ దశకంలో దూరదర్శన్ ఆమెను “తీస్తా నది సి తు చంచల” ప్రదర్శనకు ఆహ్వానించింది.
కాగా హైదరాబాదుకు చెందిన రచయిత, డాక్టర్ అర్వింద్ యాదవ్.. ‘దస్తాన్-ఈ-హేమలత’ పేరుతో పుస్తకాన్నిన్యూఢిల్లీలో సాహిత్య ఆజ్ తక్ వేదికపై ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో హేమలత గారి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలోని ఎన్నో తెలియని, ఆసక్తికరమైన సంఘటనలను పొందుపర్చారు. పండిట్ జైచంద్ భట్, హేమలత గారి తండ్రి జీవితం గురించి కూడా డాక్టర్ అర్వింద్ యాదవ్ పుస్తకంలో వివరించారు, ఇది సాహిత్య, సంగీత ప్రేమికులకు ఒక విలువైన జ్ఞాపికగా నిలుస్తుంది. హేమలత కేవలం 13 ఏళ్ల వయసులో తొలి సినిమా పాటను రికార్డ్ చేశారు. 38 భాషల్లో 5,000 కంటే ఎక్కువ పాటలు పాడిన హేమలత గారు సంగీత ప్రపంచంలో విశిష్ట స్థానాన్ని సంపాదించారు. గాయని లతా మంగేష్కర్ అందుబాటులో లేకపోతే, ఆమె స్థానంలో హేమలత గారిని ఎన్నుకునేవారు. ఈ కారణంగా ఆమెను ‘సెకండ్ లత’ అని కూడా పిలిచేవారు. 1970-80 దశకాల్లో ఎక్కువ డబ్బింగ్ పాటలను పాడిన గాయని అనే ఘనత హేమలత గారిదే. రామాయణ వంటి ప్రసిద్ధ టీవీ సీరియల్ ద్వారా ఆమె గానం ప్రతి ఇంటిలోనూ మార్మోగింది. ‘నదియా కె పార్’ చిత్రంలోని ‘కౌన్ దిశా మెయ్ లే కె చలా రే బటుహియా’ పాటను గర్భిణిగా ఉన్నప్పటికీ, ప్రసవానికి కొద్దిసేపటి ముందు రికార్డ్ చేశారు.
ఇక డాక్టర్ అర్వింద్ యాదవ్ (Dr. Arvind Yadav) తన విశిష్టమైన రచనల ద్వారా గుర్తింపు పొందారు. దస్తాన్-ఈ-హేమలత తో పాటుగా ఆయన భారత రత్న ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్. రావు, డాక్టర్ పద్మవతి, పద్మశ్రీ ఫూల్‌బసన్ యాదవ్ వంటి ప్రముఖుల జీవితచరిత్రలను రచించారు. ఈ పుస్తకం హేమలత గారి జీవితం, సంగీత ప్రపంచంలో ఆమె ప్రాధాన్యతను వివరించడమే కాకుండా, ఆమె జీవితంలోని అనేక స్ఫూర్తిదాయకమైన కథలను కూడా పొందుపరిచారు.
Read Also : Ranganath House : మా ఇల్లు బఫర్ జోన్‌లో లేదు : ‘హైడ్రా’ కమిషనర్ రంగనాథ్