Bike safety tips in Monsoon: వర్షాకాలంలో బైక్ ప్రాబ్లెమ్స్ రాకుండా ఉండాలంటే ఈ 5 టిప్స్ పాటిస్తే చాలు!

వర్షాకాలం మొదలయింది అంటే చాలు వాహన వినియోగదారులకు ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి. ఒకవైపు వర్షాలు మరొకవైపు వరదలు ఇలాంటి సమయంలోనే కొన్ని కొన్ని సార్లు వాహనాలు ట్రబుల్ ఇవ్వడం కరెక్ట్ గా నీళ్లలో వెళ్తున్నప్పుడు

  • Written By:
  • Publish Date - July 22, 2024 / 10:30 AM IST

వర్షాకాలం మొదలయింది అంటే చాలు వాహన వినియోగదారులకు ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి. ఒకవైపు వర్షాలు మరొకవైపు వరదలు ఇలాంటి సమయంలోనే కొన్ని కొన్ని సార్లు వాహనాలు ట్రబుల్ ఇవ్వడం కరెక్ట్ గా నీళ్లలో వెళ్తున్నప్పుడు ఆగిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అందుకే వర్షాకాలంలో మీ బైక్స్ అలాగే వాహనాలు సురక్షితంగా ఉండాలి అంటే కొన్ని రకాల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ ఉంటారు. అలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాహనాలు ఎక్కువ కాలం పని చేస్తాయి అంటున్నారు నిపుణులు. మరి వర్షాకాలంలో వాహనాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే వర్షాకాలంలో మీ బైక్ సజావుగా నడుస్తుందని నిర్ధారించుకోవడానికి పాటించాల్సిన టిప్స్​ లో ఒకటి బ్యాటరీ హెల్త్​ని చెక్​ చేయడం.

మీ బ్యాటరీ పాతదైతే దానిని తప్పకుండా మార్చుకోవాలి. ఒకవేళ ఆ సమయంలో బడ్జెట్ లేక మార్చుకోలేము అనుకున్న వాళ్ళు అందుకు ప్రత్యామ్నాయంగా వర్షపు నీరు నుంచి దెబ్బతినకుండా ఉండటానికి మీరు బ్యాటరీ కనెక్టర్లపై పెట్రోలియం జెల్లీని అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు భారీ వర్షంలో ప్రయాణించి, తరచూ నీటితో నిండిన రోడ్లను ఎదుర్కోవాల్సి వస్తుంటే ఇది చాలా ముఖ్యం. పెట్రోలియం జెల్లీ అనేది బ్యాటరీ టెర్మినల్స్ తుప్పు పట్టకుండా చూసుకోవడానికి సులభమైన పరిష్కారం. వర్షాకాలంలో బైక్ వాడకపోతే బ్యాటరీ డిస్ కనెక్ట్ చేయడాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అదేవిధంగా వర్షాకాలంలో లూబ్రికేషన్ కూడాఒక సమస్య కావచ్చు. ఎందుకంటే ఇది కదిలే భాగాల మధ్య ఏదైనా జిడ్డును కడిగి కడిగి వేసి వాటి మధ్య మరింత ఫిక్షన్ ని గురిచేస్తుంది. క్రమంగా ఆ పార్ట్స్ తుప్పు పట్టడానికి కూడా కారణం అవుతుంది.

చైన్, థ్రాటిల్ కేబుల్స్, ఇతర కీలక భాగాలతో సహా మీ బైక్ లేదా స్కూటర్​లో కదిలే భాగాలను క్రమం తప్పకుండా లూబ్రికేషన్ చేసేలా చూసుకోవడం మంచిది. ఎక్కువ కాలం రక్షణ కోసం వాటర్ ప్రూఫ్ చైన్ ల్యూబ్​ని ఉపయోగించవచ్చు. అలాగే టైర్లు ఎయిర్ ప్రెజర్ సరిగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సరైన ఎయిర్ ప్రెజర్ ఉంటే తడి జారిపోయే ప్రదేశాలలో తగిన పట్టును అందిస్తుంది. అదే సమయంలో మీ టైరు హెల్త్ ను కూడా చెక్ చేసుకోవడం మంచిది. ట్రెడ్ లోతు 70 శాతం కంటే తక్కువగా ఉంటే, దాని స్థానంలో కొత్త జత రబ్బరు కోసం చూడాలి. ఇది మీకు మాత్రమే కాకుండా ఇతర రహదారి వినియోగదారులకు కూడా భద్రతా దృక్పథం నుంచి చాలా ముఖ్యమైనది. అలాగే బైక్ లో ఎలక్ట్రికల్ వర్కింగ్స్ అనగా బ్రేకులు లైట్లు, హెడ్ లాంప్, వైరింగ్ ఇవన్నీ సరిగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లూజ్ వైరింగ్, కనెక్టర్లు తుప్పు పట్టడం, దెబ్బతినే అవకాశం ఉంది. తేమ దీర్ఘకాలంలో ఎలక్ట్రికల్ కాంపోనెంట్​లను దెబ్బతీస్తుంది. అలాగే వర్షాకాలంలో బైక్ ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. మీ రైడింగ్ గేర్​ని కూడా తనిఖీ చేయడం చాలా ముఖ్యం.

Follow us