Site icon HashtagU Telugu

IT Notice : చంద్రబాబు అవినీతి పవన్ కళ్యాణ్ కు కనిపించడం లేదా..? – మాజీ మంత్రి అనిల్

ysrcp mla anil kumar strong counter to chandrababu

ysrcp mla anil kumar strong counter to chandrababu

ప్రశ్నించడం కోసమే పార్టీని పెట్టా అంటూ సీఎం జగన్ (CM Jagan) ఫై వరుస ప్రశ్నలు సంధించే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు..టీడీపీ అధినేత ముడుపుల అవినీతి కనిపించడం లేదా..అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి , ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav).

రాష్ట్రంలో ఎన్నికలు వేడి మొదలైంది..అన్ని పార్టీలు సమరశంఖానికి సిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీ తమ సంక్షేమ పథకాలతో మరోసారి ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. ప్రతిపక్ష పార్టీలు అన్నికూటమిగా ఏర్పడి జగన్ ను గద్దె దించాలని చూస్తున్నాయి. ఇప్పటికే జనసేన పార్టీ తమ మేనిఫెస్టో తో సిద్ధంగా ఉండగా..టిడిపి పార్టీ తమ మేనిఫెస్టోలోని కొన్నింటి తెలియజేయగా..దసరా రోజున పూర్తి మేనిఫెస్టో తో ప్రజల ముందుకు వస్తామని చెపుతుంది. ఇలాంటి ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)కు ఐటీ శాఖా (IT Notice) భారీ షాక్ ఇచ్చింది. ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీల సబ్ కాంట్రాక్టుల సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నారని ఆరోపిస్తూ ఆయనకు ఐటీ నోటీసులు అందజేసింది. దీనిపై ఇంతవరకు చంద్రబాబు , టీడీపీ నేతలు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ స్పందించకపోవడం ఫై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తాడే­పల్లి­లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగ‌ళ‌వారం అనిల్‌కుమార్‌యాద‌వ్ మీడి­యాతో మాట్లా­డారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇన్ కామ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్(IT) చంద్రబాబుకు షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగింది. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, అమరావతిలో కాంట్రాక్టు పనులకు సంబంధించి రెండు సంస్థలకు ఒకే ఒక్క సంవత్సరం, ఒకే అసెస్ మెంట్ ఇయర్ కు సంబంధించి రూ.118కోట్ల ముడుపులు చంద్రబాబుకు అందాయి. దీనికి సంబంధించి వివరణ ఇవ్వమని హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడం జరిగింది. షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధిగా పనిచేస్తున్న మనోజ్ వాసుదేవ్ ను విచారించగా, విచారణలో తీగలాగితే.. డొంక కదిలినట్లుగా, లావాదేవీల్లో భాగంగా ఆయన ఈమెయిల్స్, చాట్స్, ఎస్ఎంఎస్ లలో చంద్రబాబుకు ఎప్పుడెప్పుడు డబ్బులు ఇచ్చాం, ఎంతెంత డబ్బులు ఇచ్చాం, ఎవరిద్వారా డబ్బులు ఇచ్చాం, ఎలా డబ్బులు ఇచ్చాం.. అని దాదాపు రూ.118కోట్ల ముడుపుల వ్యవహారం తేలితే దానికి సంబంధించి ఇన్ కామ్ ట్యాక్స్ వారు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి, వివరణ అడగడం జరిగింది. ఏ విధంగా చంద్రబాబుకు ఈ కంపెనీల ద్వారా డబ్బులు ముట్టాయి. ఈ ముడుపుల్ని విక్కీ జైన్ ద్వారా ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు, ఏ కోడ్ లాంగ్వేజ్ లో చేర్చాలో చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ అవినీతి కేవలం అమరావతిలో రెండు సంస్థలకు, రెండు వర్క్ ల్లో జరిగినది మాత్రమే. చంద్రబాబు 5ఏళ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన లావాదేవీలు, కాంట్రాక్టులు, అమరావతి రాజధాని పేరుమీద జరిగిన భూదందాలు కానీ, మొత్తం వ్యవహారంపై ఐటీ వారు దర్యాప్తు చేస్తే దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల దోపడీ ధనం బయటకు వచ్చే పరిస్థితి. 2020లో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ పై ఇన్ కామ్ ట్యాక్స్ దాడులు జరిగాయి, ఐన్ కామ్ ట్యాక్స్ రైడ్స్ లో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ దగ్గర మొత్తం రూ.2000కోట్ల ఆస్తులు సమకూర్చుకున్నారని ఐటీ వారే ధృవీకరించడం జరిగింది అని అనిల్ అన్నారు.

Read Also : New Delhi: అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతాకు నోటీసులు

ఐటీ నోటీసులపై చంద్రబాబు కనీసం స్పందించడంలేదని, మన్ను తిన్న పాములాగా సైలెంట్ గా ఉన్నారని విమర్శించారు అనిల్. చంద్రబాబు అవినీతికి పాల్పడకపోతే రూ.118 కోట్ల ముడుపులను ఎందుకు లెక్కల్లో చూపించలేదని ప్రశ్నించారాయన. పీఏ ద్వారా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని అన్నారు. తాను సత్యహరిశ్చంద్రుడిని అని చెప్పుకునే చంద్రబాబు, ఐటీ నోటీసులపై సమాధానం చెప్పాలన్నారు అనిల్. జగన్ మీద, వైసీపీ మీద అవాకులు, చవాకులు పేలుస్తూ, మాట్లాడితే ట్వీట్ లు పెట్టే పవన్ (Pawan Kalyan)..బాబుకు ఐటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుల వ్యవహారం మీద ఎందుకు మాట్లాడట్లేదు. రూ.118కోట్ల ముడుపులకు సంబంధించిన ఇంత పెద్ద వ్యవహారంలో, నువ్వు మద్దతు తెలుపుతున్న బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఏజెన్సీ నోటీసు ఇస్తే, కనీసం ట్వీట్ కూడా పెట్టట్లేదంటే నీకు కూడా ఆ లావాదేవీల్లో ముడుపుల్లో అందాయి. పవన్ కల్యాణ్ కు కూడా ఎంతోకొంత ముట్టి ఉంటేనే- ఈరోజు మెదలకుండా, కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా చంద్రబాబును రక్షించే ప్రయత్నం చేస్తున్నాడనేది అర్థమవుతుంది కదా? అలానే, వామపక్షాలు కూడా ఎందుకు నోరు మెదపట్లేదు. ప్రతీదానికి నోరేసుకుని పడిపోయే సీపీఐ నారాయణ, రామకృష్ణ ఏమైపోయారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై కచ్చితంగా స్పందించాలి అని అనిల్ డిమాండ్ చేసారు.