Site icon HashtagU Telugu

YS Sharmila Joins Congress : రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన వైస్ షర్మిల

Sharmila Joins Cng

Sharmila Joins Cng

అంత భావించినట్లే వైస్ షర్మిల (YSRTP Chief YS Sharmila Reddy)..కాంగ్రెస్ గూటికి చేరింది. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంది. బుధువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న షర్మిల..ఈరోజు గువారం ఉదయం 10.55 గంటల సమయంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే (AICC Chief Mallikarjuna Kharge), రాహుల్ గాంధీ(Rahul Gandhi)లు ఆమెకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. వైఎస్ షర్మిలతో పాటు ఆమె భర్త అనిల్ (Brother Anil) కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. తొలిసారి ఇద్దరు అగ్ర నేతల సమక్షంలో పార్టీ విలీనం, నేతల చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్, ఏపీ పీసీసీ గిడుగు రుద్రరాజు, కొప్పుల రాజు పాల్గొన్నారు. షర్మిలతో పాటు పలువురు YSRTP నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. షర్మిల చేరికతో కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం అయ్యింది.

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీని విలీనం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా షర్మిల చెప్పుకొచ్చారు. కాంగ్రెపార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిబద్ధతో పనిచేస్తానని షర్మిల స్పష్టం చేశారు. వైఎస్‌ షర్మిలకు… ఏఐసీసీ (AICC)లో చోటు కల్పించడం లేదా ఆంధ్రప్రదేశ్ పీసీసీ (APCC) అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే… షర్మిలకు ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు రాహుల్‌ మొగ్గు చూపుతున్నారని సమాచారం.

ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర నేతలతో జరిగిన సమావేశంలో.. ఆయన, మల్లికార్జునఖర్గే ప్రత్యేకంగా షర్మిల ప్రస్తావన తీసుకొచ్చినట్టు వార్తలు వచ్చాయి. రాష్ట్ర కాంగ్రెస్‌లో షర్మిలకు ప్రాధాన్యం ఉంటుందని రాహుల్‌ గాంధీ స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో ఆమెకు ఏపీ పగ్గాలు అప్పగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Read Also : Amala Paul : పెళ్ళైన రెండు నెలలకే 3 నెలల కడుపు తెచ్చుకున్న హీరోయిన్..