Site icon HashtagU Telugu

YCP : సొంత నేతలపై రజనీ డైలాగ్ పేల్చిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్

Vasantha Krishna Prasad Shocking Comments On Own Party Leaders

Vasantha Krishna Prasad Shocking Comments On Own Party Leaders

మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) సొంత పార్టీ నేతలపై విరుచుకపడ్డారు. అది కూడా రీసెంట్ గా జైలర్ మూవీ లో రజనీ డైలాగ్ తో (Jailer Movie Rajinikanth Dialogue)..మైలవరం వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం, రైతులకు చెక్కుల పంపీణీలో పాల్గొన్న కృష్ణ ప్రసాద్.. రాష్ట్రం లో 175 మంది ఎమ్మెల్యేలలో ఎటువంటి అవినీతికి పాల్పడని వారు ఎవరైనా ఉంటే వాళ్ళల్లో తాను ఒకడిని అన్నారు. తాను ఎంత సౌమ్యంగా ఉంటాననేది ఓవైపు మాత్రమేనని.. రెండో వైపు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్నారు.

భయపెట్టో మరో రకంగానో వసంత కృష్ణప్రసాద్‌ను లొంగదీసుకోవాలనుకుంటే ఈ జన్మకి సాధ్యపడే పని కాదన్నారు. పదవులు ఇచ్చేదాకా నక్క వినయాలు ప్రదర్శించి ఇప్పుడు కుటిల బుద్దులు చూపుతున్నారని విమర్శించారు. జైలర్ మూవీ లో రజనీకాంత్ చెప్పినట్లు మొరగని కుక్క, విమర్శించని నోళ్ళు, ఈ రెండూ లేని ఊళ్ళు ఉండవు రాజా అంటూ వసంత వ్యాఖ్యలు చేశారు. వర్గాలు లేకుండా ఉండాలనుకుంటే తనకు వర్గాలను అంటగడుతున్నారని శాసన సభ్యుడు వసంత మండిపడ్డారు.

రీసెంట్ గా వసంత కృష్ణ ప్రసాద్ అమెరికా పర్యటన (Vasantha Krishna Prasad AMerica Tour) ముగించుకొని వచ్చారు. ఈ అమెరికా పర్యటనపై సొంత పార్టీనాయకులే లేనిపోని ఊహగానాలు ప్రచారం చేశారని కృష్ణ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వారందరికి కూడా తానే స్వయంగా పార్టీలో నామినేటెడ్ పదవులను కట్టబెట్టానని అన్నారు. రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అని ఆయన వ్యాఖ్యానించారు. సొంత పార్టీలోనే ఇలాంటి పోకడలు ఉన్నాయని వాపోయారు. అయితే పార్టీ రాష్ట్ర నాయకత్వం మాత్రం తన నియోజకవర్గంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు రిపోర్ట్‌లు తీసుకుంటున్నారని, తన పట్ల సీఎం జగన్ సానుకూలంగానే ఉన్నారని ఆయన వివరించారు.

Read Also:  Telangana: కేసీఆర్.. దమ్ముంటే గజ్వేల్ నుంచి గెలిచి చూపించు